Allu Arjun : తొమ్మిదిమంది విలన్స్‌తో పోరాడనున్న అల్లు అర్జున్..

Allu Arjun Pushpa : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ ఇతనే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప రాజ్ ఈ సినిమాలో తొమ్మిదిమంది విలన్స్ తో ఫైట్ చెయ్యబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 27, 2020, 10:45 AM IST
Allu Arjun : తొమ్మిదిమంది విలన్స్‌తో పోరాడనున్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్ (Allu Arjun/Twitter)
  • Share this:
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ‘పుష్ప’ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసి సంచలనం స‌ృష్టించింది చిత్రబృందం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. అడవి నేపథ్యంలో సాగుతుండడంతో ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవంతో పాటు మన్యం  అడవుల్లో ఈ సినిమాను  షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో  పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు.  ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేసారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మేలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఇక అది అలా ఉంటే అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో తలపడబోయే విలన్ ఇతనే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తొమ్మిదిమంది విలన్స్ తో ఫైట్ చెయ్యబోతున్నాడే టాక్.. అల్లు అర్జున్ అభిమానులని ఊపేస్తోంది. పుష్ప సినిమాలో చిన్న, పెద్ద విలన్స్ తొమ్మిది ఉండబోతున్నారట. అందులో కమెడియన్ సునీల్ కూడా ఉన్నాడట. సునీల్‌తో పాటు ఇంకా రావు రమేష్ మరికొంతమంది విలన్స్ అల్లు అర్జున్ కి చుక్కలు చూపిస్తారంట. ఎనిమిదిమంది చిన్న చిన్న విలన్స్ తో పాటుగా.. మెయిన్ విలన్ ఒక్కరుంటారని.. ఆ విలన్ తోనే అల్లు అర్జున్ అడుగడుగునా కష్టాలు పడుతుంటాడని.. వారి మధ్యన జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు. అయితే ఆ మెయిన్ లీడ్ విలన్ పాత్రలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ని విలన్ వేషంలో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో.. ఉపేంద్ర, సుదీప్, ఆర్య వంటి పేర్లు ఈ పాత్ర కోసం పరిశీలనలోకి వచ్చాయి. ఇక లేటెస్ట్’గా నటుడు విక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. యాక్టింగ్‌కు అవకాశమున్న పాత్ర కావడంతో విక్రమ్ కూడా సానుకూలంగా స్పందించారని టాక్. త్వరలోనే 'పుష్ప'లో విక్రమ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.

పుష్ప సినిమా (pushpa movie)
పుష్ప సినిమా (pushpa movie)


సుకుమార్ సినిమాల్లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కంపల్సరీగా ఉంటుంది. అంతేకాదు మూమూలుగా సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్స్ అదిరిపోతాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ సాంగ్‌ను ఓ బాలీవుడ్ భామపై చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సాంగ్‌లో కియారా నటిస్తుందని మొన్నటి దాకా వార్తలు రాగా.. తాజాగా మరో హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఏవరితో బన్ని డాన్స్ చేయనున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా అందాల తార.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న నటిస్తోంది. ఎప్పటిలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయినా... రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2021లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
Published by: Suresh Rachamalla
First published: November 27, 2020, 10:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading