Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు త్రిపుల్ ధమాకా..

అల్లు అర్జున్ (Twitter/Photo)

Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడా అంటే ఔననే అంటున్నాయి బన్ని సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడా అంటే ఔననే అంటున్నాయి బన్ని సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా మన హీరోలు తమ పుట్టినరోజు సందర్భంగా తమ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అనౌన్స్‌మెంట్ లేదా టీజర్ లేదా కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా అల్లు అర్జున్ కూడా ఏప్రిల్ 8న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నట్టు సమాచారం. ఆ రోజు ’పుష్ప’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    మరోవైపు అల్లు అర్జున్.. తన పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివతో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. దాంతో పాటు మరో కొత్త చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పుష్ఫ సినిమా విషయానికొస్తే..  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌  పూర్తి మాసివ్‌గా ఉంది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోంది.

    allu arjun, aa20, pushpa, director sukumar, allu arjun as pushpa, sukumar pushpa, maredumilli, rampachodavaram, Pushpa latest update, Pushpa completed two schedules, Rashmika mandanna, pushpa latest update, pushpa budget,pushpa release date, pushpa teaser release date, allu arjun birthday, pushpa next schedule, rashmika mandanna joins next schedule in pushpa, పుష్ప, అల్లు అర్జున్, పుష్ప టీజర్ రిలీజ్ డేట్, అల్లు అర్జున్ పుట్టినరోజు
    అల్లు అర్జున్ ‘పుష్ఫ’ సినిమా (Twitter/Photo)


    ఇక కొరటాల శివతో చేస్తోన్న సినిమాతో  అల్లు అర్జున్.. ఫస్టాఫ్‌లో స్టూడెంట్ లీడర్‌గా.. సెకండాఫ్‌లో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని ఢీ కొట్టే పొలిటికల్ లీడర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం దాదాఫు ఖాయం అయిందట. సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో కథానాయికగా అనుకుంటున్నారు. మొత్తంగా పుట్టినరోజున తన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నడన్న మాట.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: