‘పుష్ప’ సినిమా కథ లీక్.. ‘రంగస్థలం’ సీక్వెల్‌లా ఉండబోతుందా..?

Allu Arjun Pushpa: ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుంచి కూడా అల్లు అర్జున్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. సుకుమార్ మరోసారి తమ హీరోకు బ్లాక్ బస్టర్ ఇస్తారని నమ్ముతున్నారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 5, 2020, 3:34 PM IST
‘పుష్ప’ సినిమా కథ లీక్.. ‘రంగస్థలం’ సీక్వెల్‌లా ఉండబోతుందా..?
రామ్ చరణ్ అల్లు అర్జున్ (ram charan allu arjun)
  • Share this:
ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుంచి కూడా అల్లు అర్జున్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. సుకుమార్ మరోసారి తమ హీరోకు బ్లాక్ బస్టర్ ఇస్తారని నమ్ముతున్నారు వాళ్లు. పైగా రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన విధానం కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు బన్నీ. సినిమా అంతా స్మగ్లింగ్ నేపథ్యంలోనే సాగుతుంది. పుష్ప టైటిల్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ సుకుమార్ ‘పుప్ఫ’ మూవీ (Twitter/Photos)
ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ సుకుమార్ ‘పుప్ఫ’ మూవీ (Twitter/Photos)


ఇదిలా ఉంటే ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో కనిపిస్తున్న న్యూస్ ప్రకారం చూస్తుంటే.. ఇది కూడా రంగస్థలం తరహాలోనే పూర్తిగా రివెంజ్ స్టోరీ అని తెలుస్తుంది. లెక్కల మాస్టారు కన్ఫ్యూజింగ్ కథలకు గుడ్ బై చెప్పేసి హాయిగా రూరల్ కథలపై పడ్డాడు. మరోసారి రివేంజ్ కథనే నమ్ముకుంటున్నాడు ఈ దర్శకుడు అని తెలుస్తుంది. సినిమా అంతా పగ ప్రతీకారాల చుట్టూనే సాగుతుందని ప్రచారం జరుగుతుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ల వల్ల తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు పుష్పక్ నారాయణ్.. అదే మన పుష్ప ఉరఫ్ అల్లు అర్జున్.

సుకుమార్ మూవీలో అల్లు అర్జున్ కొత్త లుక్ (Twitter/Photo)
సుకుమార్ మూవీలో అల్లు అర్జున్ కొత్త లుక్ (Twitter/Photo)


తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి లారీ డ్రైవర్‌గా ఎర్ర చందనం స్మగ్లర్ బ్యాచ్‌లో చేరి.. వాళ్ల కథ తుదముట్టిస్తాడని.. దాంతో రివేంజ్ డ్రామా కాస్తా ఫుల్ ఫిల్ అవుతుందని తెలుస్తుంది. తెలిసిన కథే అయినా కూడా చాలా మలుపులతో ఈ కథను సుకుమార్ డిజైన్ చేస్తున్నాడని తెలుస్తుంది. రంగస్థలం చిట్టిబాబును మరిపించే పాత్ర అవుతుందని.. పుష్ప కచ్చితంగా బన్నీ కెరీర్‌లో టాప్‌లో నిలుస్తుందని సుకుమార్ నమ్మకంగా చెబుతున్నాడు. ఫ్యాన్స్ కూడా ఇదే నమ్ముతున్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)


ఇక పుష్ప పాత్రకి రష్మిక మందన్న సహాయంగా ఉంటుందని.. ఈమె కూడా పూర్తిగా డీ గ్లామరైజ్డ్ పాత్ర చేస్తుందని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే కథ కావడంతో మరోసారి బన్నీ దుమ్ము దులిపేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలిక.. ఇందులో ఎంతవరకు నిజముందో..? వచ్చే ఏడాది పుష్ప విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 5, 2020, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading