ALLU ARJUN PUSHPA MOVIE SHOOTING SHIFTED FROM KERALA TO NALGONDA BY SUKUMAR PK
అల్లు అర్జున్ ‘పుష్ప’ కోసం సుకుమార్ సూపర్ ప్లానింగ్..
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
Allu Arjun Pushpa: ‘రంగస్థలం’ లాంటి సినిమా తర్వాత రెండేళ్లుగా సుకుమార్ మరో సినిమా చేయలేదు. మధ్యలో మహేష్ బాబు సినిమా అనుకున్నా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్తో సినిమా..
‘రంగస్థలం’ లాంటి సినిమా తర్వాత రెండేళ్లుగా సుకుమార్ మరో సినిమా చేయలేదు. మధ్యలో మహేష్ బాబు సినిమా అనుకున్నా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నాడు. దీనికి పుష్ప అనే టైటిల్ కూడా పెట్టాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీల్లో కూడా ఒకేసారి విడుదల కానుంది. అల్లు అర్జున్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. పుష్ప సినిమా పూర్తిగా హై ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఇందులో బన్నీ తరహాలో డాన్సులు, రొమాన్స్, కామెడీ ఉండవు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
పూర్తిగా రివేంజ్ కథతో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. రంగస్థలం సినిమాను మించిన ఎమోషన్ ఇందులో ఉంటుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా కోసం ముందుగా కేరళలోని ఓ అడవిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసాడు. తర్వాత షెడ్యూల్ కోసం బన్నీ అడుగు పెడతానడేమో అనుకుంటే కరోనా వచ్చింది. దాంతో 100 రోజులుగా నో షూటింగ్స్.. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా షూటింగ్ చేయడానికి దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.
అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar)
ఇలాంటి తరుణంలో సుకుమార్ అదిరిపోయే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నాడు. కేరళలో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ను తెలంగాణలోని నల్గొండ జిల్లా అడవులలో ఈ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే దట్టమైన అడవి ప్రాంతంలో లొకేషన్స్ వెతికే పనిలో సుకుమార్ నిమగ్నం అయినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.