Allu Arjun - Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ . ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ (Pushpa) పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరే ఈ సినిమా షూటింగ్ రద్దు అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ ఈ రోజు నుంచి మొదలైనట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్‌లో జరుగుతోంది. ఆ తర్వాత శేషాచలం అడవుల్లో చేయనున్నారు. ఈ రోజు నుంచి కంటిన్యూ 45 రోజుల షూటింగ్‌తో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ సినిమా స్టోరీ నిడివి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే కదా. సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. హీరోగా బన్నికి ఇదే తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ టీజర్ తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలో 75 మిలియన్ వ్యూస్ సంపాదించిన టీజర్‌గా రికార్డులకు ఎక్కింది.
ఈ సినిమా రెండు భాగాల కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. హీరోగా అల్లు అర్జున్ కెరీర్లో తొలి ప్యాన్ ఇండియా మూవీ. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరి చూడాలి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి మాయ చేస్తాడో మరి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.