హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun - Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్..

Allu Arjun - Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్..

Allu Arjun - Pushpa: గత కొన్ని రోజులు తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాకు సంబంధించిన విడుదల తేదిలను అధికారికంగా ప్రకటిస్తున్నారు. తాజాగా ‘పుష్ప’ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.

  Allu Arjun - Pushpa: గత కొన్ని రోజులు తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాకు సంబంధించిన విడుదల తేదిలను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబుతో పాటు సీనియర్ హీరో వెంకటేష్ కూడా తమ  సినిమాలకు సంబంధించిన విడుదల తేదిలను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు అదే రూట్లో అల్లు అర్జున్ కూడా తను సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘పుష్ప’ సినిమాను విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా స్టోరీ నిడివి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే కదా.  సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది.

  ముందుగా ఈ సినిమాను ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు  ఈ సినిమా ఫస్ట్ పాటను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.  ఇక ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. డేట్ మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 23 లేదా 24న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.

  పుష్ప’ సినిమా విషయానికొస్తే.. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్ని, సుక్కు కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ (Pushpa) పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది.

  అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ (Twitter/Photo)

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. హీరోగా బన్నికి ఇదే తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. రీసెంట్‌గా విడుదలైన  ఈ మూవీ టీజర్ తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలో 78 మిలియన్ వ్యూస్ సంపాదించిన టీజర్‌గా రికార్డులకు ఎక్కింది.

  అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ (Twitter/Photo)

  ఈ సినిమా రెండు భాగాల కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  హీరోగా అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ. క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతాడా లేదా అనేది చూడాలి.

  First published:

  Tags: Allu Arjun, Bollywood news, Mythri Movie Makers, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood

  ఉత్తమ కథలు