అల్లు అర్జున్ ‘పుష్ప’కు చిరంజీవి బెస్ట్ విషెస్ (Twitter/Photo)
Chiranjeevi Special Wishes to Allu Arjun - Pushpa Team | అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత వీళ్లిద్దరి కలియికలో వస్తోన్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ విడుదల సందర్భంగా పుష్ప యూనిట్‌కు స్పెషల్ విషెస్ తెలియజేసారు.
Chiranjeevi Special Wishes to Allu Arjun - Pushpa Team | అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత వీళ్లిద్దరి కలియికలో వస్తోన్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ మూవీ రిలీజ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఇప్పటికే అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీదా చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప సినిమా గురించే చర్చ జరుగుతంది. ఒక్క హిందీ వెర్షన్ తప్ప.. అన్ని భాషల్లో ఈ సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నారు ’పుష్ప’ మూవీ టీమ్. దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి.
ఇప్పటికే ‘పుష్ప’ మూవీ టీమ్‌కు బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సహా పలువరు హీరోలు బెస్ట్ విషెస్ అందజేసారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ‘పుష్ప’ టీమ్‌కు స్పెషల్ బెస్ట్ విషెస్ తెలియజేసారు. ఎన్నో యేళ్ల మీ రక్తం, చెమటతో పాటు ఎంతో మనసు పెట్టి చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
Wishing dear @alluarjun Director #Sukumar@iamRashmika@MythriOfficial & entire Team of @PushpaMovie All the Very Best!
You all have put your Blood,Sweat,Heart & Soul into this film! I wish all your efforts will be whole heartedly appreciated! Good Luck 👍
ఇప్పటికే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంభ థియేటర్స్‌లో ‘పుష్ప’ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా సోల్డ్ అయిపోయాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు. తమిళ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా టోటల్‌గా అన్ని భాషల్లో కలిసి రూ. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ తగ్గేదేలె అనిపిస్తుంది. భారీ అంచనాలతో డిసెంబర్ 17న 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఐకాన్ స్టార్ అర్జున్ పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఇందులో విలన్. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఉ అంటావా మావ.. ఉఉ అంటావా మావా అంటూ సాగే ఈ పాట ఇప్పటికే సంచలనం రేపుతుంది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది స్యామ్ సాంగ్. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.