Home /News /movies /

ALLU ARJUN PUSHPA MOVIE MAY NOT RELEASE IN HINDI THEATRES FOR THIS REASON SR

Allu Arjun | Pushpa : పుష్ప చిత్రానికి అనుకోని అడ్డంకులు.. హిందీ థియేటర్ రిలీజ్ కష్టమే..

Pushpa Photo : Twitter

Pushpa Photo : Twitter

Allu Arjun | Pushpa : ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. అయితే అంతా బాగున్నా.. ఓ విషయంలో చిక్కోచ్చి పడింది. ఈ సినిమా హిందీ వర్షన్ థియేటర్‌లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్​ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటోందని సమాచారం.

ఇంకా చదవండి ...
    అల్లు అర్జున్  (Allu Arjun)సుకుమార్  (Sukumar) కాంబినేషన్‌లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. అయితే అంతా బాగున్నా.. ఓ విషయంలో చిక్కోచ్చి పడింది. ఈ సినిమా హిందీ వర్షన్ థియేటర్‌లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్​ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటోందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. పుష్ప సినిమాని పాన్ ఇండియా చిత్రంగా అనుకోక‌ముందు తెలుగు,మలయాళంలో విడుదల చేయాలనీ చిత్రబృందం భావించింది.

    దీంతో చిత్రం షూటింగ్‌ను ప్రారంభించక ముందే అల్లు అర్జున్‌ సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల్ని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు అమ్మేసారట నిర్మాతలు. అయితే ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనీ భావించి.. అందుకు తగ్గట్లుగానే నిర్మించి, ప్రమోషన్స్ చేశారు. ప్రతీ పోస్టర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు.

    అంతేకాదు ఓ పాటను కూడా హిందీలో విడుదల చేశారు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి.. పుష్పను థియేటర్‌లో ఎలా విడుదల చేస్తారని..  నాకు హిందీ యూట్యూబ్ డబ్బింగ్ రైట్స్ అమ్మీ.. ఇదేంటనీ ఎదురు తిరిగాడట. దీంతో చిత్రబృందం చేసేది ఏమీ లేక హిందీ తప్ప అన్ని భాషాల్లో థియేటర్ విడుదలకు రెడీ అయ్యిందని అంటున్నారు. అందులో భాగంగా తాజాగా విడుదలైన సునీల్ పోస్టర్‌.. హిందీ తప్ప అన్ని భాషాల్లో విడుదల చేశారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా... ఇక తాజాగా మూడో సింగిల్ ” సామి సామి ” కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. మోనిక యాదవ్ పాడారు. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటుడు సునీల్ లుక్‌ను వదిలారు. ఈ సినిమాలో నటుడు సునీల్ తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్ర‌ను చేస్తున్నాడని అంటున్నారు. పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న సునీల్ మంగలం శ్రీను పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు ఉదయం 10:08 గంటలకు సునీల్ లుక్‌ విడుదలైంది. ఆ లుక్‌లో సునీల్ అదరగొడుతున్నారు. చెప్పాలంటే లుక్ అదిరిపోయిందని అని అంటున్నారు నెటిజన్స్. మంగళం శ్రీను గా సునీల్ భయంకరంగా కనిపిస్తున్నారు.


    ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓ భారీ మాస్‌ సాంగ్‌ను చిత్రికరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం అల్లు అర్జున్ 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్‌లో పాల్గోంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ బుల్లెట్ పై కూర్చుని కనిపిస్తున్నారు. ఈ పాట గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా‌ లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.

    ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది పుష్ప టీమ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది.

    Pooja Hegde: టాప్ హీరోయిన్‌గా రాణిస్తోన్న పూజా హెగ్డే తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా... పిక్ వైరల్..

    ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది.

    ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో  విడుదలకానుంది.ౌ
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Allu Arjun, Allu arjun pushpa movie, Pushpa film, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు