Home /News /movies /

ALLU ARJUN PUSHPA MOVIE DAAKKO DAAKKO MEKA FULL SONG RELEASED TA

Pushpa - Allu Arjun : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక ఫుల్ సాంగ్ విడుదల..

‘పుష్ప’ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదల (Twitter/Photo)

‘పుష్ప’ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదల (Twitter/Photo)

Allu Arjun | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక పుల్ పాటను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    Allu Arjun | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పుషకి 2 నుంచి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు.

    తాజాగా ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక పూర్తి పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇపుడీ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.


    పుష్ప ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. రెండవ వారంలో అడుగు పెట్టిన పు్ష్ప సోమవారం రూ. 2.75 కోట్లు, మంగళవారంరూ.  2.50 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. 13వ రోజు రూ. 1.5 వరకు వసూళు చేసింది. దీంతో ఈ మూవీ ఇప్పటివరకు రూ.  43.95 కోట్ల గ్రాస్ రూ. 21.85 కోట్ల షేర్ వసూళు చేసి రికార్డ్ సృష్టించింది.

    Tollywood Top Movies 2021 : అఖండ,వకీల్ సాబ్,పుష్ప సహా 2021లో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..

    పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా 13 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..

    నైజాం (తెలంగాణ): 38.34 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
    సీడెడ్ (రాయలసీమ): 13.31 కోట్లు / 18 కోట్లు
    ఉత్తరాంధ్ర: 7.31 కోట్లు / 12.25 కోట్లు
    ఈస్ట్: 4.48 కోట్లు / 8 కోట్లు
    వెస్ట్: 3.69 కోట్లు / 7 కోట్లు
    గుంటూరు: 4..73 కోట్లు / 9 కోట్లు
    కృష్ణా: 3.88 కోట్లు / 7.5 కోట్లు
    నెల్లూరు: 2.88 కోట్లు / 4 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: 78.62 కోట్లు / 101.75 కోట్లు
    తమిళనాడు: 8.47 కోట్లు / 6 కోట్లు
    కర్ణాటక: 10.36 కోట్లు / 9 కోట్లు
    హిందీ: 21.85 కోట్లు / 10 కోట్లు
    ఓవర్సీస్: 12.45 కోట్లు / 13 కోట్లు
    రెస్టాఫ్ ఇండియా: 2.15 కోట్లు / 1.15 కోట్లు
    కేరళ: 4.65 కోట్లు / 4 కోట్లు
    13 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 138.72 కోట్లు (236 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

    పుష్ప సినిమాకు రూ.  145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులోరూ.  102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 13 రోజుల్లో ఈ సినిమాకు రూ.  138.72 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా రూ. 7.28 కోట్లు వస్తే హిట్ అనిపించకుంటోంది.  అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు