Home /News /movies /

ALLU ARJUN PUSHPA MOVIE A GRAND ONE BILLION PLUS VIEWS FOR PUSHPA THE RISE SONGS ACROSS 4 LANGUAGES COLLISION SYMBOL TA

Allu Arjun - Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ మరో తిరుగులేని రికార్డు.. తగ్గేదేలే అంటున్న బన్ని..

‘పుష్ప’ మూవీ మరో రికార్డు (Twitter/Photo)

‘పుష్ప’ మూవీ మరో రికార్డు (Twitter/Photo)

Allu Arjun - Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ మరో తిరుగులేని రికార్డు.. తగ్గేదేలే అంటున్న బన్ని.. వివరాల్లోకి వెళితే..  తాజాగా ఈ సినిమా ఖాతాలో..

    Allu Arjun - Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ మరో తిరుగులేని రికార్డు.. తగ్గేదేలే అంటున్న బన్ని.. వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై నెగిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్‌ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది.  అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప.

    ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 173 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ విషయానికొస్తే.. రూ. 332 కోట్లు వసూళు చేసి సంచలనం సృష్టించింది. ఒక్క హిందీలోనే రూ. 42. 70 కోట్ల షేర్ రాబట్టింది. తాజాగా ‘పుష్ప’ ది రైజ్ మూవీ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని పాటలు అన్ని భాషల్లో కలిపి 1 బిలియన్ వ్యూస్‌ రాబట్టింది. అంతేకాదు 2021లో మన దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఆడియో కూడా 1 బిలియన్ వ్యూస్ కేవలం తెలుగులోనే రాబట్టింది.



    మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషల్లో సంబంధించి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మంచి వసూళ్లనే రాబట్టడం విశేషం. ఐతే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ.  22 కోట్ల భారీ రేటుకు ఐదు భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

    Prabhas - Radhe Shyam : 1970 నాటి ఇట‌లీని రాధే శ్యామ్ లో ఎలా క్రీయేట్ చేశారు..? ఆర్ట్ డైరెక్ట‌ర్ చెప్పిన విశేషాలు.. ?


    పుష్ప సినిమాకు రూ.  145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏపీలో పలు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ డబ్బింగ్  వెర్షన్ ఈ నెల 26న  విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Bollywood news, Pushpa, Rashmika mandanna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు