Home /News /movies /

ALLU ARJUN PUSHPA LATEST COLLECTIONS HERE AND MOVIE RELEASED IN AMAZON PRIME VIDEO AND GETTING HUGE RESPONSE PK

Pushpa Latest collections: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. అమెజాన్‌లో వచ్చాక ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా..?

అల్లు అర్జున్ ‘పుష్ప’ కలెక్షన్స్ (Twitter/Photo)

అల్లు అర్జున్ ‘పుష్ప’ కలెక్షన్స్ (Twitter/Photo)

Pushpa Latest collections: పుష్ప సినిమాకు (Pushpa Latest collections) 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 150 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప.

ఇంకా చదవండి ...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మొదటి వారం తర్వాత కాస్త స్లో అయినా కూడా.. అనూహ్యంగా మూడో వారంలో పుంజుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన 20వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షలు షేర్ వచ్చింది. కానీ ఆ తర్వాత రోజు దారుణంగా పడిపోయాయి వసూళ్లు. మరోవైపు హిందీ, తమిళంలో మాత్రం జోరు తగ్గడం లేదు. నాలుగో వీకెండ్‌కు ముందే సినిమా ఓటిటిలో వచ్చేసింది. జనవరి 7న విడుదల చేసారు ఈ సినిమాను. అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే ఓటిటి ఆఫర్ రావడంతో అనుకున్న దానికంటే ముందుగానే సినిమాను ఓటిటిలో విడుదల చేసారు. అయితే హిందీ వర్షన్ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ఎందుకంటే అక్కడ ఇంకా మంచి వసూళ్లు వస్తున్నాయి. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. ఇప్పటి వరకు పుష్ప ఎంత వసూలు చేసిందో ఓ సారి చూద్దాం..

నైజాం: 36.68 కోట్లు
సీడెడ్: 14.20 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.88 కోట్లు
ఈస్ట్: 4.87 కోట్లు
వెస్ట్: 4.08 కోట్లు
గుంటూరు: 5.29 కోట్లు
కృష్ణా: 4.17 కోట్లు
నెల్లూరు: 3.08 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 80.25 కోట్లు
తమిళనాడు: 10.30 కోట్లు
కర్ణాటక: 10.40 కోట్లు
కేరళ: 5.05 కోట్లు
ఓవర్సీస్: 12.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 31.50 కోట్లు
వరల్డ్ వైడ్ లేటెస్ట్ కలెక్షన్స్: 150.25 కోట్లు షేర్

Pushpa Deleted scenes: ‘పుష్ప’ వేస్టేజ్ ఖర్చు అన్ని కోట్లా.. చిన్న నిర్మాతలకు ఇస్తే 4 సినిమాలు చేసుకునేవాళ్లు..


పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 150 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప. ఇక్కడ మరో 16 కోట్లు రావాలి. నాలుగో వీకెండ్ సినిమాను ఓటిటిలో విడుదల చేయడంతో కలెక్షన్స్ ఆగిపోయాయి. అందుకే తెలుగులో మినహా అన్నిచోట్ల సినిమా సేఫ్ అయింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu arjun pushpa movie, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు