Home /News /movies /

ALLU ARJUN PUSHPA INFORMATION AND BROAD CASTION MINISTRY SHARES MEME ON ALLU ARJUNS PUSHPA TO CORONA AWARENESS TA

Allu Arjun - Pushpa : డెల్టా అయినా.. ఓమైక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే అంటున్న ‘పుష్ప రాజ్’.. వైరల్ అవుతున్న కేంద్ర ప్రభుత్వ ట్వీట్..

మాస్క్‌‌తో ‘పుష్ప’ (Twitter/Photo)

మాస్క్‌‌తో ‘పుష్ప’ (Twitter/Photo)

Allu Arjun - Pushpa : మాస్క్‌తో అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’ కొత్త ఫోటో.. ఓమైక్రాన్ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడానికి కేంద్ర సమాచార శాఖ మాస్క్‌తో ఉన్న పుష్ప ఫోటోను షేర్ చేశారు.

    Allu Arjun - Pushpa : మాస్క్‌తో అల్లు అర్జున్పుష్ప రాజ్’ కొత్త ఫోటో.. ఓమైక్రాన్ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడానికి కేంద్ర సమాచార శాఖ మాస్క్‌తో ఉన్న పుష్ప ఫోటోను షేర్ చేశారు. ఓ మాస్ హీరోతో ప్రజలు మాస్క్ పెట్టుకోవాలంటూ చేసిన ఈ ప్రయోగం ప్రజల్లో వేగంగా దూసుకుపోయే అవకాశం ఉండటం వల్ల ఇపుడు ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రయోగంతో సామాన్య ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంతో పాటు, కరోనా కొత్త నియమ నిబంధనలు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలతో పాటు వివిధ సంస్థలు ఇపుడున్న కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ ఇలాంటి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టి ప్రజలు ఆర్జీసీ బస్సుల్లో ప్రయాణం చేయడంలో సక్సెస్ అయ్యారు.

    ఈ సందర్భంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా  సినిమాలోని పాపులర్ డైలాగులతో మీమ్స్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాక కూడా ప్రజల్లో కరోనా పై అవగాహన కలిగేలా.. అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ‘పుష్ప’ మూవీని ఎంచుకుంది. ఇందులో ఎంతో పాపులర్ అయిన ‘తగ్గేదేలే’ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్ చేసింది. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



    కరోనాపై అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం ’#IndiaFightsCorona@COVIDNewsByMIB’ పేరుతో సెపరేట్‌గా ఓ ట్విట్టర్ పేజ్ రన్ చేస్తోంది. ఈ ట్విట్టర్ ఖాతాలో పుష్ప రాజ్ మాస్క్ పెట్టుకున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేశారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో చెప్పిన తగ్గేదేలే డైలాగ్ చెప్పే సన్నివేశానికి సంబంధించిన ఫోటో తీసుకొని ఎడిట్ చేసి మాస్క్ పెట్టారు. ఈ ఫోటోపై ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ‘పుష్ప.. పుష్పరాజ్’.. తగ్గేదేలే ను కొంచెం మార్చి .. ‘డెల్టా అయినా.. ఓమైక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే అని రాశారు.

    Prabhas - Radhe Shyam : 1970 నాటి ఇట‌లీని రాధే శ్యామ్ లో ఎలా క్రీయేట్ చేశారు..? ఆర్ట్ డైరెక్ట‌ర్ చెప్పిన విశేషాలు.. ?

    ‘పుష్ప’.. పుష్పరాజ్.. ఎవరైనా.. కోవిడ్ పై  యుద్దం ఇంకా కంటిన్యూ చేయాల్సిన తరుణం ఇది. ప్రజలు ఈ నాలుగు విషయాలను అసలు మరిచిపోవద్దన్నారు. ఎపుడు మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధల ప్రకారం కోవిడ్ టీకా  తీసుకోవాలంటూ ఈ పోస్ట్‌కు యాడ్ చేశారు. దాంతో పాటు ఈ యాడ్‌ను అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్నకు ఈ ట్వీట్ ట్యాగ్ చేశారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Central Government, Pushpa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు