Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పుషకి 2 నుంచి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. పుష్ప ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది.
అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొడుతోంది.
#PushpaHindi which is released without publicity has done the unthinkable. It has crossed #KGF lifetime Hindi collections in 13 days. #Pushpa has collected ₹45.5 crores so far. @alluarjun whose Hindi dubs in YouTube topped the views, made a grand theatrical entrance now!?? pic.twitter.com/HWWeMdMXB8
— idlebrain jeevi (@idlebrainjeevi) December 30, 2021
పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు.
#PushpaHindi is unstoppable! ??
Collects Rs. 45.5 crore net in 13days. ?#JhukungaNahi ?#PushpaTheRise #PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @TSeries @GTelefilms @AAFilmsIndia @MythriOfficial pic.twitter.com/SwRbAVzvey
— Pushpa (@PushpaMovie) December 30, 2021
ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ను వస్తోంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఇక ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్లకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిపారు. ఈ ఈవెంట్‌కు రాజమౌళి వచ్చి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
పుష్పను తమిళ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు.
Anchor Manjusha : యాంకర్ మంజూష బ్యూటీఫుల్ పిక్స్ .. అదరహో అనాల్సిందే..
ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుపుకుంది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, KGF, Pushpa Movie, Sukumar, Tollywood news