Home /News /movies /

ALLU ARJUN PUSHPA FIRST SINGLE RELEASE ON AUGUST 13 OFFICIAL ANNOUNCEMENT DUE TO DEVI SRI PRASAD BIRTHDAY TA

Allu Arjun - Pushpa: దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ మూవీ నుంచి బిగ్ అప్డేట్..

’పుష్ప’ లో అల్లు అర్జున్ (File/Photo)

’పుష్ప’ లో అల్లు అర్జున్ (File/Photo)

Allu Arjun - Pushpa: దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ఇచ్చింది. అవును ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ ఎపుడు విడుదల చేస్తున్నది ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Allu Arjun - Pushpa: దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ఇచ్చింది. అవును ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ ఎపుడు విడుదల చేస్తున్నది ప్రకటించారు. ‘పుష్ప’ సినిమా విషయానికొస్తే.. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ (Pushpa) పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది.

    ఈ సినిమా స్టోరీ నిడివి ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే కదా. సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది. ముందుగా ఈ సినిమాను ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా అందరి ఆశలపై నీళ్లు చల్లంది. దీంతో ఈ సినిమాను విడుదల చేస్తానన్న ఆగష్టు 13న ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు గాయకులు ఈ సినిమా పాట పాడుతున్నట్టు  ఓ వీడియోను విడుదల చేసారు.


    ‘పుష్ప’ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌‌ను ఐ తెలుగులో శివమ్ పాడనున్నారు. కన్నడలో విజయ్ ప్రకాష్ .. మలయాళంలో రాహుల్ నంబియార్.. బెన్ని దయాల్ తమిళం.. హిందీలో విశాల్ దద్లాలీ  ఈ పాటను పాడనున్నట్టు తెలిపారు. మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    పుష్పలో అల్లు అర్జున్ (Twitter/Photo)


    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. హీరోగా బన్నికి ఇదే తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. రీసెంట్‌గా విడుదలైన  ఈ మూవీ టీజర్ తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలో 78 మిలియన్ వ్యూస్ సంపాదించిన టీజర్‌గా రికార్డులకు ఎక్కింది.

      పుష్ప గా అల్లు అర్జున్ (ప్రతీకాత్మక చిత్రం)


    ఈ సినిమా రెండు భాగాల కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  హీరోగా అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరి చూడాలి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి మాయ చేస్తాడో మరి
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Devi Sri Prasad, Mythri Movie Makers, Rashmika mandanna, Sukumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు