Allu Arjun - Pushpa: క్లాస్ నుండి మాస్ గా మారిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఒకేసారి మాస్ లుక్ లో కనిపించిన బన్నీ ప్రేక్షకులను తెగ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన డిఫరెంట్ పాత్రతో కనిపించనుంది.
అక్రమ రవాణా చేస్తున్న గంధపుచెక్కల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదలైన టీజర్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. అందులో బన్నీ లుక్ మాత్రం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఎంతోమంది వీక్షించగా ఇప్పటివరకు అతి తక్కువ సమయంలోనే ఏకంగా 50 మిలియన్స్ ప్రేక్షకులు చూశారు. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో ఈ టీజర్ ఇంత ప్రేక్షకుల వీక్షణను అందుకుందంటే.. ఆల్ టైమ్ రికార్డ్ సాధించిందని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజరే ఇంత రికార్డ్ అందుకుందంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను అందుకుంటుందో అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం కోవిడ్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Pushpa film, Teaser record, Tollywood