Home /News /movies /

ALLU ARJUN PUSHPA 18 DAYS WW COLLECTIONS EXCEPT AP ALL AREAS GETS PROFITS AND BREAKEVEN PK

Pushpa 18 days WW Collections: అల్లు అర్జున్ ‘పుష్ప’ 18 డేస్ కలెక్షన్స్.. అక్కడ తప్ప అన్నిచోట్ల బ్లాక్‌బస్టర్..

అల్లు అర్జున్  Photo : Twitter

అల్లు అర్జున్ Photo : Twitter

Pushpa 18 days WW Collections: పుష్ప (Pushpa 18 days WW Collections) సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 18 రోజుల్లో ఈ సినిమాకు 156 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప. ఇక్కడ మరో 16 కోట్లు రావాలి.

ఇంకా చదవండి ...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి వారం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కానీ వారం రోజుల తర్వాత తెలుగులో నెమ్మదిగా డౌన్ ఫాల్ మొదలైంది. అయితే అనూహ్యంగా మూడో వారంలో పుంజుకుంది ఈ చిత్రం. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. విడుదలైన 17వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 2.12 కోట్ల షేర్ వచ్చింది. కానీ ఆ తర్వాత రోజు దారుణంగా పడిపోయాయి వసూళ్లు. కేవలం 43 లక్షలు వసూలు చేసింది ఈ చిత్రం. మరోవైపు హిందీ, తమిళంలో మాత్రం జోరు తగ్గడం లేదు. మూడో వీకెండ్ అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 83.80 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 18 రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలో చూద్దాం..

నైజాం: 40.23 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
సీడెడ్: 14.76 కోట్లు / 18 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.92 కోట్లు / 12.25 కోట్లు
ఈస్ట్: 4.78 కోట్లు / 8 కోట్లు
వెస్ట్: 3.91 కోట్లు / 7 కోట్లు
గుంటూరు: 5.00 కోట్లు / 9 కోట్లు
కృష్ణా: 4.13 కోట్లు / 7.5 కోట్లు
నెల్లూరు: 3.13 కోట్లు / 4 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 83.80 కోట్లు / 101.75 కోట్లు
తమిళనాడు: 10.48 కోట్లు / 6 కోట్లు
కర్ణాటక: 11.22 కోట్లు / 9 కోట్లు
హిందీ: 31.00 కోట్లు / 10 కోట్లు
ఓవర్సీస్: 13.02 కోట్లు / 13 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.20 కోట్లు / 1.15 కోట్లు
కేరళ: 5.23 కోట్లు / 4 కోట్లు
18 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 156.50 కోట్లు (290 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

Shyam Singha Roy 11 days collections: ‘శ్యామ్ సింగరాయ్’ 11 డేస్ కలెక్షన్స్.. భారీగా పడిపోయిన వసూళ్లు..


పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 18 రోజుల్లో ఈ సినిమాకు 156 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప. ఇక్కడ మరో 16 కోట్లు రావాలి. మూడో వీకెండ్ ఎవరూ ఊహించని స్థాయిలో పర్ఫార్మ్ చేసింది పుష్ప. అందుకే తెలుగులో మినహా అన్నిచోట్ల సినిమా సేఫ్ అయింది. 18వ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu arjun pushpa movie, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు