ALLU ARJUN PUSHPA 12 DAYS WW COLLECTIONS FOR THE 1ST TIME AFTER RELEASE MOVIE COLLECTS UNDER 1 CRORE SHARE IN TELUGU STATES PK
Pushpa 12 days WW Collections: ‘పుష్ప’ 12 డేస్ కలెక్షన్స్.. తొలిసారి కోటి కంటే తక్కువ పడిపోయిన వసూళ్లు..
Allu Arjun Pushpa Photo : Twitter
Pushpa 12 days WW Collections: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్ (Pushpa 12 days WW Collections). ఈ సినిమాకు మొదటి వారం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కానీ వారం రోజుల తర్వాత తెలుగులో నెమ్మదిగా డౌన్ ఫాల్ మొదలైంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి వారం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తెలుగుతో పాటు మిగిలిన చోట్ల కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కానీ వారం రోజుల తర్వాత తెలుగులో నెమ్మదిగా డౌన్ ఫాల్ మొదలైంది. కానీ హిందీ, తమిళంలో మాత్రం జోరు తగ్గడం లేదు. వీక్ డేస్ మొదలైన తర్వాత అల్లు అర్జున్ సినిమాకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. వీక్ డేస్లో పుష్ప చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా పడిపోయాయి కలెక్షన్స్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో 78.21 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 12 రోజుల్లో ఈ సినిమాకు ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలో చూద్దాం..
పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 12 రోజుల్లో ఈ సినిమాకు 136 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం 23 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే విడుదలైన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే తక్కువ షేర్ తీసుకొచ్చింది పుష్ప. 12వ రోజు ఈ సినిమాకు 69 లక్షల షేర్ వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.