Allu Arjun : ఆ విధంగా పూరీ జగన్నాథ్‌ను సంతోష పెట్టిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ Photo : Twitter

Puri Jagannadh: కరోనా కారణంగా ప్రస్తుతం ఇంట్లో ఖాలీగా ఉంటున్న పూరి తన పోడ్‌కాస్ట్‌ల ద్వారా ఆడియో రూపంలో స్ఫూర్తివంతమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

  • Share this:
    పూరీ జగన్నాథ్.. సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు 70శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం ఇంట్లో ఖాలీగా ఉంటున్న పూరి తన పోడ్‌కాస్ట్‌ల ద్వారా ఆడియో రూపంలో స్ఫూర్తివంతమైన విషయాలను చెబుతున్నాడు. తన అభిమానులతో పంచుకుంటున్నాడు.

    ఇప్పటికే ఇలా చాలా పోడ్ కాస్ట్‌లను విడుదల చేసిన పూరి తాజాగా.. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారిలో మార్పు తెచ్చేలా, వారికి ధైర్యం నింపేలా ఆడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత తాజాగా, స్త్రీల గొప్పదనాన్ని చెబుతూ, వారిని తక్కువ చేసి చూస్తోన్న వారి దృక్పథం మారేలా స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోడ్ కాస్ట్‌లో పూరి ఏ విధంగా స్త్రీలు అబలలుగా చిత్రీకరించబడ్డారు. తరతరాలుగా స్త్రీ జాతిపై సమాజంలో ఉన్న వైఖరిని వివరించి.. ఎంతో స్పూర్తి వంతంగా చెప్పాడు. అయితే ఆ పోడ్ కాస్ట్‌ను విన్న అల్లు అర్జున్.. పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేశాడు. పూరీ జగన్నాథ్ పోడ్‌కాస్ట్‌లో చెబుతున్న మంచి విషయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చాలా అద్భుతమని ఈ సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నాడు. అవి తనకు ఎంతో బాగా నచ్చాయని చెప్పాడు. అంతేకాదు ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను మరికొనని వివరించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అర్జున్ తన ట్వీట్ ద్వారా తెలిపాడు.





    అల్లు అర్జున్ ట్వీట్‌కు స్పందించిన పూరీ.. అలా అల్లు అర్జున్ తనను మెచ్చుకున్నందుకు ఆనందంతో ఉప్పొంగిపోయానని చెప్పాడు. బన్నీలాంటి వ్యక్తి నుంచి ఇంత గొప్ప ప్రశంస రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా పూరీ తెలిపాడు. ఈ సంతోషంలో పూరి ఈ రోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తాననంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన విజయ్ దేవరకొండతో  ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో ఓ సినిమాకు పూరి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: