హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun | Major : మహేష్‌కు అల్లు అర్జున్ అభినందనలు.. మేజర్ టీమ్‌పై ప్రశంసలు..

Allu Arjun | Major : మహేష్‌కు అల్లు అర్జున్ అభినందనలు.. మేజర్ టీమ్‌పై ప్రశంసలు..

Allu Arjun Photo : Twitter

Allu Arjun Photo : Twitter

ఈAllu Arjun | Major : సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్ మేజర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇంకా చదవండి ...

    Allu Arjun | Major :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్ మేజర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ (Allu Arjun) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ మరోసారి తన మ్యాజిక్‌ చేశారు. కథలో కీలక పాత్రల్లో నటించి ప్రకాష్ రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్‌ ఇచ్చారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్కా తన ప్రతిభ చూపించారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరింది. ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత మహేష్‌కు (Mahesh Babu) ప్రత్యేక కృతజ్ఞతలంటూ అభినందించారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్.. థాంక్యూ.. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు అల్లు అర్జున్. క్షణం నుండి మేజర్ వరకు మీ సపోర్ట్ మరవలేనిది అంటూ బదులిచ్చారు. ఇక మేజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మేజర్ మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏకంగా 4 కోట్ల మార్క్ ని కూడా అందుకుంది. మేజర్ మొదటి రోజు 4.07 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి.. దాదాపుగా హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకుందని అంటున్నారు. అయితే హిందీలో మాత్రం అంచనాలను అందుకోలేక పోయిందని తెలుస్తోంది.

    ఇక మరోవైపు మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ ఖాలీగా ఉంటున్నాయి. పూర్తిగా నిండడం లేదు. ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్‌కు ఖరారు చేశారు.

    ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ 13 కోట్లు ఉండగా.. వరల్డ్ వైడ్ బిజినెస్ వాల్యూ 18 కోట్ల రేంజ్‌లో ఉంటుందని టాక్. దీంతో ఈసినిమా 19 కోట్ల రేంజ్‌‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో మొదటి రోజు వసూళ్లు కాకుండా.. ఇంకా 11.88 కోట్ల షేర్‌ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

    Major Photo : Twitter
    Major Photo : Twitter

    ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Adivi Sesh, Allu Arjun, Mahesh Babu, Major Movie

    ఉత్తమ కథలు