గత కొన్నాళ్లుగా మన హీరోలు.. వేరే హీరోలు నటించిన సినిమాలు బాగుంటే.. .. ఎలాంటి ఈగోలకు పోకుండా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇపుడొస్తున్న యంగ్ హీరోలందురూ ఎంతో ఫ్రెండ్లీగా ఎవరి సినిమానైనా బాగుంటే.. సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా అడివి శేష్’ హీరోగా నటించిన ‘ఎవరు’ సినిమాను మెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా ‘క్షణం’,‘గూఢచారి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్.. తాజాగా ‘ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాతో అడివి శేష్.. మూడు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు రెజీనా, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాను ప్రముఖ హీరో స్టైలిష్ స్టార్ అర్జున్ చూసి.. హీరో అడివి శేష్‌తో పాటు చిత్ర బృందాన్ని ట్విట్టర్ వేదికగా మెచ్చుకున్నారు.
CONGRATULATIONS to the entire team of EVARU . @AdiviSesh @ReginaCassandra pic.twitter.com/PS08Kxrne4
— Allu Arjun (@alluarjun) August 19, 2019
ఆదివారం రాత్రి ఈ సినిమా చూసాను. ప్రతి సీన్ అద్భుతంగా ఉందన్నారు. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. అద్భుతమైన కథలో అడివి శేష్ నటన బాగుందన్నారు. ‘ఎవరు’ సినిమాతో అడివి శేష్ హీరోగా హాట్రిక్ హిట్ అందుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.