హోమ్ /వార్తలు /సినిమా /

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘రాములో రాములో’ పాట మరో అరుదైన రికార్డు..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘రాములో రాములో’ పాట మరో అరుదైన రికార్డు..

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)

Ala Vaikunthapurramloo Ramulo Ramulo Song | ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాలోని రాములో రాములా సాంగ్ మరో రికార్డును క్రియేట్ చేసింది.

ఇంకా చదవండి ...

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములో, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్టైయ్యాయి. రిలీజ్‌కు ముందే రాములో రాములో యూట్యూబ్‌లో లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో పాటలు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 362 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే కదా.

' isDesktop="true" id="595762" youtubeid="Bg8Yb9zGYyA" category="movies">

ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని రాములో రాములో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో తాజాగా 200 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక రాములో రాములో లిరికల్ వీడియో సాంగ్ 300 వ్యూస్ రాబట్టింది. మొత్తంగా ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్‌లోని రాములో రాముల పాట మొత్తంగా 500 మిలియన్ వ్యూస్‌‌‌ను ‌ సంపాదించింది. తెలుగులో ఓ పాట ఈ రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకోవడం పెద్ద విశేషమే. మొత్తంగా తెలుగులో రాములో రాములో లిరికల్, ఫుల్ వీడియో కలిపితే.. ఈ పాటనే ఎక్కువగా చూసారు యూట్యూబ్‌లో. మొత్తంగా కరోనా కారణంగా కొత్త సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఈ సినిమాలోని పాటలనే హమ్ చేస్తున్నారు. ఏమైనా కొత్త సినిమాల ఆల్బమ్ వచ్చేంత వరకు ‘అల వైకుంఠపుమురములో సినిమాలోని పాటల రచ్చ ఆగేలా కనిపించడం లేదు. మొత్తంగా  అల వైకుంఠపుమురములో సాంగ్స్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.  మొత్తంగా ఈ సినిమాలోని సాంగ్స్ ‌ వందల మిలియన్ వ్యూస్‌ను తక్కువ సమయంలో రాబట్టం ఒక రికార్డు అనే చెప్పాలి.

First published:

Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pooja Hegde, Thaman, Tollywood, Trivikram

ఉత్తమ కథలు