news18-telugu
Updated: August 27, 2020, 3:04 PM IST
అల వైకుంఠపురములో మరో అరుదైన రికార్డు (Twitter/Photo)
Ala Vaikunthapurramloo | అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. దాదాపు తన పేరు మీద ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంది ఈ మూవీ. త్రివిక్రమ్ మాయకు తమన్ సంగీతానికి అల్లు అర్జున్ నటన, డాన్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్పెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 333 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరోవైపు రాములో రాములో పాటతో పాట, సామజవరగమన పాట కూడా 180 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన పేరిట రాసుకుంది.

‘అల వైకుంఠపురములో’లో అల్లు అర్జున్, పూజా హెగ్డే (Twitter/Photo)
బిగ్ స్క్రీన్ పై ఎన్నో సంచలనాలతో పాటు పాటలతో యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘అల వైకుంఠపురములో’ మూవీ తాజాగా స్మాల్ స్క్రీన్ పై రికార్డు టీఆర్పీని సెట్ చేసింది. రెండు వారాల క్రితం జెమినీ టీవీలో ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏకంగా 29.4 టీఆర్పీ రాబట్టి స్మాల్ స్క్రీన్ పై సునామి క్రియేట్ చేసింది. మొత్తంగా వెండితెరపైనే చిన్ని తెరపై కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 27, 2020, 3:04 PM IST