హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun - Pooja Hegde : హాట్రిక్ కాంబినేషన్‌కు సిద్దమైన అల్లు అర్జున్, పూజా హెగ్డే.. ఏ మూవీ కోసమంటే..

Allu Arjun - Pooja Hegde : హాట్రిక్ కాంబినేషన్‌కు సిద్దమైన అల్లు అర్జున్, పూజా హెగ్డే.. ఏ మూవీ కోసమంటే..

అల్లు అర్జున్, పూజా హెగ్డే (Twitter/Photo)

అల్లు అర్జున్, పూజా హెగ్డే (Twitter/Photo)

Allu Arjun - Pooja Hegde : హాట్రిక్ కాంబినేషన్‌కు అల్లు అర్జున్, పూజా హెగ్డే రెడీ అయ్యారంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

  Allu Arjun - Pooja Hegde : హాట్రిక్ కాంబినేషన్‌కు అల్లు అర్జున్, పూజా హెగ్డే రెడీ అయ్యారంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తెలుగు సినిమాల్లో  ప్రస్తుతం ఒక హీరో, హీరోయిన్ ఒక సినిమాలో కలిసి నటిస్తేనే గొప్పగా ఫీలవుతున్నారు. కానీ అల్లు అర్జున్, పూజా హెగ్డే మాత్రం తొలిసారి ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో కలిసి నటించారు. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో పూజా హెగ్డే బికినీలో దర్శనమిచ్చి అభిమానులను కనువిందు చేసింది. అంతేకాదు ఈ సినిమా విజయంలో పూజా హెగ్డే అందాలు కీ రోల్ పోషించాయి. ఆ తర్వాత వీళ్లిద్దరు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో జోడిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.

  అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ పాట హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు తెలుగులో 668 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తెలుగులో ఈ రేంజ్‌లో వ్యూస్ దక్కించుకున్న తొలిపాటగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మరోసారి ‘ఐకాన్’ మూవీ కోసం వీళ్లిద్దరు జోడిగా కనువిందు చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  Allu Arjun Trivikram Pooja Hegde Ala Vaikuntapurramloo Butta Bomma Song
  అల్లు అర్జున్, పూజా హెగ్డే ‘బుట్ట బొమ్మ’ సాంగ్ (Twitter/Photo)

  గతంలో ‘ఐకాన్’ సినిమా అనౌన్స్  చేసినపుడు కథానాయికగా పూజా హెగ్డే పేరును పరిశీలించారు. తాజాగా పూజానే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా కన్ఫామ్ చేసినట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. శ్రీరామ్ వేణు విషయానికొస్తే.. ఈయన రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇపుడు అల్లు అర్జున్‌తో ప్రకటించిన ‘ఐకాన్’ సినిమాను త్వరలో పట్టాలెక్కించనున్నారు.  ‘ఐకాన్’లో అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయంతో పాటు అంధుడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్  ఈ చిత్రాన్ని ‘పుష్ప’ సినిమా రెండో భాగం తర్వాత చేయనున్నారు.

  ఇవి కూడా చదవండి.. 

  Bigg Boss - Arshi Khan : అఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌తో పెళ్లి రద్దు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ

  Evaru Meelo Koteeswarulu - Jr NTR : ఎన్టీఆర్ షోలో రానా సాయం తీసుకున్న రామ్ చరణ్..


  Nagarjuna - Ram Charan: ఆ తరంలో నాగార్జున.. ఈ జననరేషన్‌లో రామ్ చరణ్‌కు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది..


  Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu Arjun, Pooja Hegde, Tollywood

  ఉత్తమ కథలు