Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: September 22, 2019, 6:19 PM IST
అల్లు అర్జున్ అల్లు అర్హ (Source: Twitter)
అల్లు అర్జున్ తనకు ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికినా కూడా వెంటనే చేసే పని కూతురుతో ఆడుకోవడం. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. తన కూతురుకు తన డైలాగులే నేర్పిస్తున్నాడు. నేర్పించడమే కాదు.. ఆడుకుంటున్నాడు కూడా. అలాగే బన్నీ కూతురు కూడా చాలా శ్రద్ధగా డాడీ చెప్పే మాటలు అంటూ సరదాగా అల్లరి చేస్తుంది. ఓ వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమా చేస్తూనే.. మరోవైపు కుటుంబంతో కూడా బిజీగా ఉన్నాడు. షూటింగ్స్‌తో అలిసిపోయిన బన్నీ.. ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్నాడు. హాయిగా వాళ్లతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.
ఇప్పుడు కూడా బన్నీ తన కూతురుపై ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూతురుతో ఎం చక్కా అన్నీ మరిచిపోయి ఆనందంగా ఉన్నాడు బన్నీ. మొన్నటికి మొన్న డోన్ట్ కిల్ సో మెనీ టైమ్స్.. ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగును నేర్పించిన బన్నీ.. ఇప్పుడు ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అంటూ తన డైలాగ్ చెప్పించాడు. ఇవ్వలే వచ్చింది అంటూ ముద్దు మాటలతో ఆకట్టుకుంది ఈ చిట్టితల్లి. ఈ డైలాగ్ ఆ పాప కూడా అక్షరాలా అనేస్తుంది.
ఇద్దరూ కలిసి ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. గతంలో కూడా కూతురుతో కలిసి ఇలాంటి వీడియోలు చేసాడు బన్నీ. అప్పుడు కూడా తను చెప్పిన మాటలను కూతురుకు నేర్పించాడు అల్లు వారబ్బాయి. నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూతురుతో అనిపించాడు బన్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని వరకు అన్న ఆ చిన్నారి.. చేసుకోనంటూ ముద్దుగా పలుకుతుంది. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న వీడియో అప్పట్లో బాగానే వైరల్ అయింది. మళ్లీ ఇప్పుడు ఫసక్ డైలాగ్ కూతురుతో చెప్పించాడు బన్నీ.
Published by:
Praveen Kumar Vadla
First published:
September 22, 2019, 6:19 PM IST