అల్లు అర్జున్ మరో సంచలనం.. NDTVతో స్పెషల్ ఇంటర్వ్యూ..

Allu Arjun: ఒకే ఒక్క సినిమా.. ఒక్క సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. మార్కెట్ పెరిగిపోయింది.. స్టామినా తెలిసిపోయింది. ఇప్పటి వరకు బన్నీ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. అల వైకుంఠపురములో సినిమా మరో ఎత్తు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2020, 10:10 AM IST
అల్లు అర్జున్ మరో సంచలనం.. NDTVతో స్పెషల్ ఇంటర్వ్యూ..
అల్లు అర్జున్ (Twitter/allu arjun)
  • Share this:
ఒకే ఒక్క సినిమా.. ఒక్క సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. మార్కెట్ పెరిగిపోయింది.. స్టామినా తెలిసిపోయింది. ఇప్పటి వరకు బన్నీ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. అల వైకుంఠపురములో సినిమా మరో ఎత్తు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సంచలనం అనేది చిన్నమాటే అవుతుంది ఈ చిత్రం సృష్టించిన రికార్డుల ముందు. నాన్ బాహుబలి అనే కేటగిరీలో అగ్రస్థానంలో ఉంది ఈ చిత్రం. ఇప్పటి వరకు 157 కోట్లకు పైగా షేర్.. 260 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్యాన్ ఇండియా విడుదల లేకుండా ఇన్ని కోట్లు వసూలు చేసిన హీరో అల్లు అర్జున్ ఒక్కడే.
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్స్ ఇంకా ఆపడం లేదు ఈయన. ఇప్పటికే మీడియాతో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాడు బన్నీ. వాళ్లకు పార్టీలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఇదే చేయబోతున్నాడు.. పార్టీ కాదు ఇంటరాక్షన్. తెలుగుతో పాటు తమిళ, హిందీ మీడియాను కూడా కవర్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు NDTVతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాడు. ఈ టాప్ మీడియా హౌజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)

#AlluArjunOnNDTV హ్యాష్ ట్యాగ్‌తో బన్నీని ప్రశ్నలు అడగొచ్చంటుంది ఈ మీడియా సంస్థ. సుకుమార్ సినిమా మొదలుపెట్టే ముందు చివరి ప్రమోషనల్ ఈవెంట్ చేసి వెళ్తున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమా తన కెరీర్‌కు ఎంతగానో సాయపడిందని.. దానికి త్రివిక్రమ్‌కు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు అంటున్నాడు ఈయన. మొత్తానికి ఇప్పుడు NDTV ఇంటర్వ్యూతో మరోసారి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవ్వాలని చూస్తున్నాడు అల్లు వారబ్బాయి.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు