టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన గర్ల్ ఫ్రెండ్ స్నేహా రెడ్డిని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ కులాంతర వివాహానికి అల్లు అర్జున్ తల్లితండ్రులు అల్లు అరవింద్, నిర్మల అంగీకరించారా ? అనే విషయానికొస్తే..
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన గర్ల్ ఫ్రెండ్ స్నేహా రెడ్డిని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ కులాంతర వివాహానికి అల్లు అర్జున్ తల్లితండ్రులు అల్లు అరవింద్, నిర్మల అంగీకరించారా ? అసలు స్నేహాను పెళ్లి చేసుకుంటానని బన్ని అన్నపుడు వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయమై రీసెంట్గా ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పేరెంట్స్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బన్ని కులాంతర వివాహానికి సంబంధించిన విషయం వాళ్లు ఇంట్లో కేవలం ఐదు నిమిషాల్లోనే సెటిల్ అయిపోయిందట. ముందు స్నేహ విషయం అల్లు అర్జున్..తన తల్లైన నిర్మల దగ్గరే చెప్పాడని అల్లు అరవింద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అర్జున్ వచ్చి స్నేహను చేసుకుంటాను అంటే నువ్వు ఎవరిని చేసుకున్నా.. మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండటం కంటే మాకు కావాల్సింది ఏంముందన్నారు. అలా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్న సంగతిని ఈ సందర్భంగా బన్ని తల్లి తండ్రలైన అరవింద్, నిర్మల వెల్లడించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.