అల్లు అయాన్ ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ కాదట.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ (Twitter/Photo)

Allu Arjun Allu Ayaan | టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌కు ఆయన తనయుడు అల్లు అయాన్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంతకీ మ్యాటరేమిటంటే..

 • Share this:
  టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌కు ఆయన తనయుడు అల్లు అయాన్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంతకీ మ్యాటరేమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి అండదండలతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ  ఫ్యామిలీ హీరోల్లో ఒకడిగా ఉంటూనే.. కథానాయకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు మెగా ఫ్యామిలీ హీరోల్లో ఎవరికీ లేనట్టు అల్లు అర్జున్‌కు మలయాళ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో  పాటు బన్ని.. హిందీ డబ్బింగ్ చిత్రాలకు నార్త్‌లో ఏ తెలుగు హీరోలకు లేనంత క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో డబ్ చేసిన పెట్టడమే ఆలస్యం మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న అల్లు అర్జున్‌కు ఆయన కొడుకు పెద్ద షాక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్‌కు తన ఇంట్లో ఉన్న తండ్రి అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో కాదట. అలా అని మెగా హీరోల్లో వేరే ఎవరైనా ఇష్టమని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ బుడతడికి మాత్రం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ అంటే ఎంతో ఇష్టమట.
  View this post on Instagram

  #alluarjun's junior #alluayaan talking about #tigershroff


  A post shared by ALLU ARJUN 🌟 (@alluarjuninsta) on

  అంతేకాదు టైగర్ ష్రాఫ్ నటించిన ‘భాఘీ’ సిరీస్ సినిమాల్లోని ఫైట్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.ఈ వీడియోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసాడు. తాజాగా అల్లు అయాన్ బాఘీ యాక్టర్ టైగర్‌ ష్రాఫ్‌కు ఓ రిక్వెస్ట్ చేసాడు.  తనను ‘భాఘీ 3’ సెట్‌కు పిలవమని టైగర్‌ను అడిగాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తనయుడు అయాన్ టైగర్ ఫ్రాఫ్‌ పేరును టైగర్ స్క్వాష్ అని  పిలిచాడు. దీనికి బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ స్పందించాడు. కేవలం ‘భాఘీ 3’ సెట్ కే  కాదు తాను యాక్ట్ చేస్తోన్న అన్ని సినిమాల సెట్స్‌కు ఆహ్వానిస్తున్నానని అయాన్‌కు చెప్పండి అల్లు అర్జున్ సర్ అని కామెంట్ చేసాడు. అంతేకాదు తన పేరును టైగర్ స్వ్కాష్ అని పిలవడం మాత్రం కొత్తగా ఉందన్నాడు. ఇక టైగర్ ఫ్రాఫ్ కూడా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పరుగు’ హిందీ రీమేక్ ‘హీరో పంతి’ సినిమాతో బాలీవుడ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే కదా.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: