అల్లు అర్జున్ నయా లుక్... చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ బాటలో...

తన నయా మూవీ అల వైకుంఠపురములో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించాడు

news18-telugu
Updated: August 15, 2019, 12:39 PM IST
అల్లు అర్జున్ నయా లుక్... చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ బాటలో...
‘అల.. వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ అఫీషియల్‌గా విడుదలైంది. తనదైన స్టయిల్లో అల వైకుంఠపురములో అంటూ బన్నీ కొత్త సినిమాకు టైటిల్‌ను ఖరారు చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో ఆడియెన్స్ ముందుకు రాబోయే ఈ సినిమాపై టాలీవుడ్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో లో మూవీలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త కొత్త లుక్‌లో కనిపించనుండటం విశేషం. టీజర్‌లో కనిపించిన అల్లు అర్జున్ హెయిర్ స్టయిల్ కాస్త కొత్తగా కనిపించింది. టీజర్‌లో జులపాలతో కనిపించాడు అల్లు అర్జున్. బన్నీ ఈ రకమైన హెయిర్ స్టయిల్‌తో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్.

అయితే టాలీవుడ్‌లో ఈ రకమైన హెయిర్ స్టయిల్ కొత్తేమీ కాదు. 90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ లుక్‌ను ఫాలో అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌తో పాటు అనేకమంది టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు జులపాలతో కనిపించి మూవీ లవర్స్‌ను ఎంటర్ టైన్ చేశారు. అయితే ఆ తరువాత ట్రెండ్ మారిపోవడంతో... హీరోలు కూడా కొత్త హెయిర్ స్టయిల్స్‌లోకి మారిపోయారు. అయితే తాజాగా అల్లు అర్జున్ మరోసారి జులపాలతో కనిపిస్తుండటంతో... బన్నీ 90వ దశకంలోని హీరోలను గుర్తు చేస్తున్నాడని సినీప్రియులు చర్చించుకుంటున్నారు.


First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>