ALLU ARJUN MAHESH BABU COMPROMISED AND HERE THE NEW RELEASE DATES OF ALA VAIKUNTAPURRAMULOO AND SARILERU NEEKEVVARU MOVIES PK
అల్లు అర్జున్, మహేష్ బాబు కాంప్రమైజ్.. మారిన రిలీజ్ డేట్స్..
అల్లు అర్జున్ మహేష్ బాబు Instagram
సంక్రాంతి సినిమాల విషయంలో చాలా భయపడుతున్నారు బయ్యర్లు. ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోలు వస్తామని చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లకు నిద్ర కూడా రావడం లేదు. ఓ వైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న..
సంక్రాంతి సినిమాల విషయంలో చాలా భయపడుతున్నారు బయ్యర్లు. ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోలు వస్తామని చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లకు నిద్ర కూడా రావడం లేదు. ఓ వైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురములో.. మరోవైపు మహేష్ బాబు, అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఇద్దరు హీరోలు. ముందు మహేష్ ఈ డేట్ తీసుకున్నా కూడా తర్వాత వచ్చి బన్నీ కూడా అదే తేదీ కావాలని పట్టుబట్టాడు. దాంతో ఎవరికీ ఎవరూ తగ్గట్లేదు. చివరికి ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు.. నిర్మాతల మధ్య ఒప్పందం కుదిరింది.
మహేష్ బాబు,అల్లు అర్జున్ (File Photo)
దిల్ రాజు, అల్లు అరవింద్ కూర్చుని మాట్లాడుకుని తమ సినిమాల విడుదల తేదీల్లో మార్పు తెచ్చారు. అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వస్తుంది. ఇక అనుకున్నట్లుగానే జనవరి 12న బన్నీ వస్తున్నాడు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో సినిమాలు విడుదల కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు దర్శక నిర్మాతలు. దాంతో బయ్యర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో కూడా బాలయ్య, చిరంజీవి లాంటి హీరోలు ఇలాగే ఒక్కరోజు గ్యాప్‌లో వచ్చారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లాభమే. మరి చూడాలిక.. ఈ మారిన విడుదల తేదీలతో బన్నీ, మహేష్ ఎలాంటి మాయ చేయబోతున్నారో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.