హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun : అఖిల్ సాంగ్ వింటూ ఫ్యామిలీతో అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్.. వీడియో వైరల్..

Allu Arjun : అఖిల్ సాంగ్ వింటూ ఫ్యామిలీతో అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్.. వీడియో వైరల్..

Allu Arjun and Sneha Reddy Photo : Instagram

Allu Arjun and Sneha Reddy Photo : Instagram

Allu Arjun : పుష్ప సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావ‌డంతో అల్లు అర్జున్ హైదరాబాద్‌ రోడ్లపై ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవ‌లే భార్య స్నేహా రెడ్డితో మాల్దీవ్స్‌కు వెళ్లొచ్చిన ఆయన కారులో త‌న కూతురు, వైఫ్‌ని తీసుకొని లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావ‌డంతో బ‌న్నీ హైదరాబాద్‌ రోడ్లపై ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవ‌లే భార్య స్నేహా రెడ్డితో మాల్దీవుల‌కి వెళ్లొచ్చిన అల్లు అర్జున్ ప్ర‌స్తుతం కారులో త‌న కూతురు, వైఫ్‌ని తీసుకొని లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. అల్లు అర్జున్ స్వ‌యంగా కారు న‌డుపుతుండ‌గా, కూతురు మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ కనిపించింది. ఈ వీడియోను స్నేహా రెడ్డి షూట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో అఖిల్ లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లోని గుచ్చే గులాబి లాగా సాంగ్‌ వినిపిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను అల్లు అరవింద్, బన్ని వాసు కలిసి నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇక అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Sai Dharam Tej | Republic : రిపబ్లిక్ కలెక్షన్స్.. థియేటర్ రన్ కంప్లీట్... ఎన్ని కోట్ల లాస్ అంటే..

ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించారు.

ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవ్వడంతో డిసెంబర్‌లో వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.

First published:

Tags: Akhil Akkineni, Allu Arjun, Most Eligible Bachelor, Pushpa film, Tollywood news

ఉత్తమ కథలు