news18-telugu
Updated: November 12, 2020, 5:38 PM IST
అడవిలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ (Twitter/Photo)
Allu Arjun Entry Into Pushpa Sets | దాదాపు ఏడు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ కోసం సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ యేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ ని సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి..సుకుమార్ దర్శకత్వలో ‘పుష్ప’సినిమాకు ఓకే చెప్పాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది. కేవలం ముహూర్తం షాట్ తర్వాత ఎలాంటి షూటింగ్ జరుపుకోని ‘పుష్ప’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10న ప్రారంభమైంది. తాజాగా అల్లు అర్జున్.. పుష్పరాజ్ వచ్చేసినాడు అంటూ అడవిలో ఎంట్రీ ఇస్తోన్న ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను కేరళ అడవుల్లో కాకుండా.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవంతో పాటు మన్యం అడవుల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్ (Twitter/Photo)
ఆ తర్వాత షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేసారు. ఒకపుడు సత్య మంగళం అడవులు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అడ్డాగా ఉండేది. ఇపుడు అక్కడే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ సంపాదించే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మేలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 12, 2020, 5:38 PM IST