హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun: లేట్ నైట్ అల్లు అర్జున్ రొమాంటిక్ డ్రైవ్.. ఆమెతో కలిసి రోడ్లపై షికార్లు.. వీడియో వైరల్

Allu Arjun: లేట్ నైట్ అల్లు అర్జున్ రొమాంటిక్ డ్రైవ్.. ఆమెతో కలిసి రోడ్లపై షికార్లు.. వీడియో వైరల్

Allu Arjun Photo twitter

Allu Arjun Photo twitter

Allu Arjun road trip: ఏ మాత్రం సమయం దొరికినా భార్యాపిల్లలతో కలిసి దేశంలోని అందమైన లొకేషన్స్ తో పాటు విదేశాలు చుట్టి వచ్చే అల్లు అర్జున్.. ఈ సారి మాత్రం హైదరాబాద్ రోడ్లపై కారులో షికార్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హైదరాబాద్ (Hyderabad) రోడ్లపై తెగ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. తన కారులో హాయిగా రొమాంటిక్ ట్రిప్ వేశారు. లేట్ నైట్ వేసిన ఈ రొమాంటిక్ డ్రైవ్ లో పక్కనే బన్నీ సతీమణి స్నేహారెడ్డి (Sneha Reddy) కూడా ఉన్నారు. పుష్ప సినిమా ఫినిష్ చేశాక షూటింగ్స్ పరంగా కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. తన ఫ్యామీలీతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. బిజీ లైఫ్ లో దొరికిన ఈ కొద్ది సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతూ సరదాగా టూర్లు వేస్తున్నారు.

ఏ మాత్రం సమయం దొరికినా భార్యాపిల్లలతో కలిసి దేశంలోని అందమైన లొకేషన్స్ తో పాటు విదేశాలు చుట్టి వచ్చే అల్లు అర్జున్.. ఈ సారి మాత్రం హైదరాబాద్ రోడ్లపై కారులో షికార్లు కొట్టారు. సాంగ్స్ వింటూ అల్లు అర్జున్ డ్రైవ్ చేస్తుండగా పక్కనే ఉన్న స్నేహా రెడ్డి వీడియో తీసింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా బన్నీ అభిమానులతో పంచుకుంది స్నేహా రెడ్డి. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ లుక్స్, మేనరిజం అన్ని వర్గాల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఇకపోతే పుష్ప సీక్వల్ గా పుష్ప-2 సినిమాను రూపొందిస్తున్నారు లెక్కల మాస్టరు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ ఈ నెల లోనే ప్రారంభమైంది. డిసెంబర్ లో ఓ వీడియో టీజర్‌ని వదిలి బన్నీ అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుందట. మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్న రోల్.. ఈ సినిమాలో మరింత అట్రాక్ట్ ఫుల్‌గా ఉండేలా సుక్కు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇక పుష్పలో దాక్షాయణిగా మెప్పించిన యాంకర్ అనసూయ .. మరింత పదునైన క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. పుష్ప రెండో భాగంలో అనసూయ రోల్ హైలైట్ కానుందని అంటున్నారు. నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవిని కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేయబోతున్నారట సుక్కు.

First published:

Tags: Allu Arjun, Allu sneha reddy, Pushpa 2

ఉత్తమ కథలు