• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN KORATALA SIVA MOVIE VARALAXMI SARATHKUMAR WILL PLAY CRUCIAL VILLAIN ROLE HERE ARE THE DETAILS TA

Allu Arjun - Koratala Siva: అల్లు అర్జున్, కొరటాల శివ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..

Allu Arjun - Koratala Siva: అల్లు అర్జున్, కొరటాల శివ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..

అల్లు అర్జున్ 21వ చిత్రం లేటెస్ట్ అప్‌డేట్

Allu Arjun - Koratala Siva | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ గతేడాది  ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్  తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్ప్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో స్టార్ హీరో కుమార్తె నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    :Allu Arjun - Koratala Siva: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ గతేడాది  ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్  తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌  పూర్తి మాసివ్‌గా ఉంది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాను ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

    ఈ సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నాడు. ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివ ఆచార్య తర్వాత, బన్ని పుష్ప తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  మరోవైపు ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఫస్టాఫ్‌లో స్టూడెంట్ లీడర్‌గా.. సెకండాఫ్‌లో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని ఢీ కొట్టే పొలిటికల్ లీడర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం దాదాఫు ఖాయం అయిందట.

    ఇప్పటికే రవితేజ ‘క్రాక్’లో జయమ్మగా.. అల్లరి నరేష్.. ‘నాంది’లో ఆద్యగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

    Allu Arjun - Koratala Siva | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ గతేడాది  ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్  తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్ప్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో స్టార్ హీరో కుమార్తె నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
    అల్లు అర్జున్,కొరటాల శివ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ (File/Photo)


    ఇక బన్ని, కొరటాల శివ  సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా సయూ మంజ్రేకర్ నటిస్తోంది. ఈమె సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్ 3’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అంతేకాదు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘మేజర్’ సినిమాలో కూడా నటించబోతున్నట్టు సమాచారం.

    అల్లు అర్జున్ సరసన సయీ మంజ్రేకర్ (Twitter/Photo)


    ఇక కొరటాల శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలాగే.. ఈ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా కొరటాల శివ తెరకెక్కించనున్నాడు.  నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 2022 ప్రారంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు