స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను అల్లు అర్జును పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్ రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ క్యాన్సల్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది.
Very much elated to announce my next film #AA21 with Koratala Shiva garu . Been looking forward for this for quiet a while . My best wishes to Sudakar Garu for his 1st venture . Sandy , Swathi & Nutty this is my way of showing of my love for you guys . pic.twitter.com/uwOjtSAMJV
అది అలా ఉంటే రెండు నెలల కింద ఆగిపోయినా ఈ చిత్రం షూటింగ్ ఎలాగోలా తిరిగి ప్రారంభించాలనీ చూస్తోంది చిత్రబృందం. కరోనా లాక్ డౌన్ పూరైన తర్వాత మొదలు పెడుదామని అనుకుంటే.. ఇప్పట్లో కరోనా తగ్గేలా లేదు. ప్రభుత్వం అనుమతిచ్చినా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో "పుష్ప" ప్లాన్స్ కూడా మారిపోతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ కేరళ అనుకున్నారు.. అయితే కరోనా వల్ల షూటింగ్‌ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న మహబూబ్ నగర్ అటవీ ప్రాంతంలో సినిమాను షూట్ చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఇక్కడే ఎందుకంటే హైదరాబాద్ పరిసరాల్లో ఉండటం వల్ల మొత్తం యూనిట్‌ను షిఫ్ట్ చేయకుండా.. ఏరోజుకారోజు సిబ్బంది రావాడినికి వీలుగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే దీనికంటే ముందు రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మేరకు ఫిలింసిటీలో ఓ భారీ సెట్ నిర్మాణం జోరుగా సాగుతోంది. అది కూడా అడవి సెట్టేనట. అందులో ఓ ఐటెంసాంగ్ తో పాటు కొన్ని సీన్స్ తీయాలని అనుకుంటోంది చిత్రబృందం.
అల్లు అర్జున్, కొరటాల శివ (Twitter/Photo)
ఇక ఈ సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నాడు. కరోనా కారణంగా ఇంట్లో ఖాలీగా ఉంటున్న శివ.. బన్ని సినిమాకు సంబందించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట. దాదాపు ఆ వర్క్ కూడా పూర్తి చేశాడట. శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్యను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఎప్పటిలాగే శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది. అల్లు అర్జున్ తన 21వ చిత్రం కొరటాల శివతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆసక్తి రేపుతుంది. సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి, తీరాన దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలాగే.. ఈ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా రానుంది. నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుందట. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరిలో షూటింగ్ మొదలుకానుంది. 2022 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.