Allu Arjun - Koratala Siva: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్ రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది.
ఈ సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నాడు. ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కొరటాల శివ కూడా చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ జాయిన్ కానున్నాడు. తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది.

అల్లు అర్జున్ సరసన సయీ మంజ్రేకర్ (Twitter/Photo)
ఈమె సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్ 3’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అంతేకాదు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘మేజర్’ సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా ఈమె అల్లు అర్జున్, కొరటాల శివ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా కథానాయిక విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ సరసన సయీ మంజ్రేకర్ (Twitter/Photo)
ఇక కొరటాల శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలాగే.. ఈ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా కొరటాల శివ తెరకెక్కించనున్నాడు. నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 2022 ప్రారంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 16, 2021, 06:58 IST