హోమ్ /వార్తలు /movies /

Allu Arjun - Kalyan Ram : అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..

Allu Arjun - Kalyan Ram : అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..

Allu Arjun - Kalyan Ram : అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. వివరాల్లోకి వెళితే..

Allu Arjun - Kalyan Ram : అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. వివరాల్లోకి వెళితే..

Allu Arjun - Kalyan Ram : అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. వివరాల్లోకి వెళితే..

  Allu Arjun - Kalyan Ram : అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. వివరాల్లోకి వెళితే.. మన దేశంలో రూల్స్ అనేవి సామాన్యులకే.. అదే పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తప్పులు చేస్తే చూస్తూ పోలీసులు కానీ మరే వ్యవస్థ వారి జోలికి పోదనే వాదన కూడా ఉంది. ఇక కొంత మంది అధికారులు పెద్దల మెప్పు కోసం చేసే తప్పులు మొత్తం వ్యవస్థనే తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తప్పు చేస్తే చూస్తూ పోయే అధికారులతో పాటు.. చట్టాన్ని నిక్కచ్చిగా పాటించే అధికారులు కూడా మన దగ్గర ఉన్నారు. ఇక మన దగ్గర హీరోలు కొంత మంది తాము చట్టానికీ అతీతలమనే భావన ఉంటోంది. ఏదో పై నుంచి ఊడి పడినట్టు బిల్డప్ ఇస్తుంటారు. తాజాగా చట్ట విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అమర్చిన నేపథ్యంలో టాలీవుడ్ హీరోలైన అల్లు అర్జున్‌తో పాటు కళ్యాణ్ రామ్‌కు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు.

  ఈ శనివారం జూబ్లీహిట్స్ రోడు నంబర్ 36లో నీరూస్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే టైమ్‌లో అటుగా కారులో వెళుతున్న అల్లు అర్జున్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆయన నడిపించే కారుకు నిబంధనలకు విరుద్ధంగా  ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలిగించడంతో పాటు రూ. 700 రూపాయల ఫైన్ వేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.

  HBD Ram Charan: హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఈ బర్త్ డే చెర్రీకి వెరీ వెరీ స్పెషల్..

  మరోవైపు అదే దారిలో వెళుతున్న హీరో కళ్యాణ్ రామ్ కారుకు కూడా నల్ల ఫిల్మ్ ఉండటంతో పోలీసులు ఆయనకు కారుకున్న బ్లాక్ ఫిల్మ్ తొలిగించి ఆయకు కూడా జరిమాన విధించారు. దేశంలో ప్రముఖులైన సామాన్యులైన కారుకు బ్లాక్ అద్దాలు బిగించకూడదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో వేసవి కాలం కాబట్టి కారుకు నల్ల అద్దాలు అమర్చుకున్న అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌ల కార్ల నల్ల అద్దాలను పోలీసులు తొలిగించడంతో పాటు మొదటిసారి కాబట్టి వార్నింగ్ ఇచ్చి  విడిచిపెట్టినట్టు సమాచారం.

  RRR US Premiers First Day Collections : ఆర్ఆర్ఆర్ యూఎస్ ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఊచకోత మాములుగా లేదుగా..

  ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.మరోవైపు అల్లు అర్జున్ .. గతేడాది ‘పుష్ప’ మూవీ తో మరో సక్సెస్‌ను అందుకోవడంతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో రఫ్పాడించాడు. ఈ సినిమా సక్సెస్‌తో సుకుమార్.. దర్శకత్వంలో ‘పుష్ప 2’ మూవీని మరింత పకడ్బందిగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలున్నాయి.

  First published:

  ఉత్తమ కథలు