నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు. ఒకే వేదికపై బాలయ్య, బన్నీ కనువిందు చేయనుండడం పట్ల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అఖండ (Akhanda Pre Release event) ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో చిత్రబృందం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
ఇక మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మిర్యాల రవిందర్ రెడ్డి మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేయకముందు మహర్జాతకుడు అనే టైటిల్‌ను అనుకున్నారట. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను వదిలింది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలయ్య డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 14న సాయంత్రం 7:09 గంటలకు విడుదలైన సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. లైక్స్ పరంగా వ్యూస్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
Its going to be a ? ????ive Explosion Event ?
? Icon Star @alluarjun a.k.a #Pushpa meets #Akhanda at Pre-Release Roar ??
?Shilpakala Vedika | 27th Nov @ 6:30PM#AkhandaRoaringFrom2ndDec#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth pic.twitter.com/Wv39bZqCwo
— Dwaraka Creations (@dwarakacreation) November 25, 2021
ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. అఖండకు U/A సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు రన్ టైమ్ కూడా తెలిసింది. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదలకానుందని అంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో పాట ఫ్యాన్స్‌కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్. థమన్ మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. శంకర్ మహా దేవన్ పాడారు.
నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Samantha : విడాకుల తర్వాత అక్కినేని కంపౌండ్‌లోకి సమంత.. షాక్‌లో ఫ్యాన్స్..
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది.
ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda movie, Allu Arjun, Pushpa Movie, Tollywood news