అల్లు అర్జున్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు.. రామ్ చరణ్‌‌కు చురక..

మెగా కుటుంబంలో అల్లు అర్జున్ నిజమైన పవర్ స్టార్ అంటూ రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: January 22, 2020, 7:48 AM IST
అల్లు అర్జున్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు.. రామ్ చరణ్‌‌కు చురక..
రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్,రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
మెగా కుటుంబంలో అల్లు అర్జున్ నిజమైన పవర్ స్టార్ అంటూ రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్.. అల్లు రామలింగయ్యకు నిజమైన వారుసుడు అతనేనిన అల్లు అర్జున్ నిరూపించుకున్నాడని అభిప్రాయ పడ్డాడు. ఇక నుంచి అల్లు అర్జున్ మాత్రమే నిజమైన మెగా పవర్ స్టార్ అని వ్యాఖ్యానించాడు. ఓ సూపర్ స్టార్‌గా, మెగా ఫ్యాన్స్‌ను మెప్పించే హీరోగా నిలిచింది అల్లు అర్జున్ మాత్రమే అన్నారు. కానీ మెగాభిమానులు మాత్రం మెగా పవన్ స్టార్ అని రామ్ చరణ్‌కు ఇచ్చిన నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా అవుతోంది.  తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా చిరంజీవి, రామ్ చరణ్ నటించిన సినిమాలను కలెక్షన్స్‌ను బీట్ చేయడంతో రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు