Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: July 18, 2020, 10:03 PM IST
అల్లు అర్జున్ వైఎస్ జగన్ (allu arjun ys jagan)
అల్లు అర్జున్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బన్నీ. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా లేకపోయుంటే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తై ఉండేది. కానీ అనుకోకుండా వాయిదా పడింది. ఇదిలా ఉంటే పుష్ప తర్వాత మరో ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు నటిస్తున్న పుష్ప కూడా ప్యాన్ ఇండియన్ సినిమానే.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
అన్ని భాషల్లోనూ దీన్ని విడుదల చేస్తున్నాడు సుకుమార్. అలాంటి ఎమోషనల్ కథతోనే వస్తున్నాడు కూడా. రంగస్థలంను మించిన ఎమోషనల్ డ్రామా ఇందులో ఉంటుందంటున్నాడు సుకుమార్. ఇదిలా ఉంటే పుష్ప తర్వాత మహి వి రాఘవ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు వారబ్బాయి. ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్నాడు మహి. ఈయనతో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు ఈయన. సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ కథను ఫైనల్ చేసాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ వైఎస్ జగన్ (allu arjun ys jagan)
త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని.. అందులో అల్లు అర్జున్ ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఓ రకంగా ఈ చిత్రం జగన్ బయోపిక్ అని ప్రచారం జరుగుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో ఉన్న ఓ కుర్రాడు.. ముఖ్యమంత్రి అయిన తన తండ్రి చనిపోతే వచ్చి ఆ తర్వాత ఎలా రాజకీయాలను శాసించాడు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది.

అల్లు అర్జున్ వైఎస్ జగన్ (allu arjun ys jagan)
వింటుంటేనే ఇది జగన్ స్టోరీ అనేది అర్థమవుతుంది. దాన్ని తన స్టైల్లో తెరకెక్కించాలని చూస్తున్నాడు మహి. యాత్ర సినిమాను డీల్ చేసిన విధానానికి అల్లు అర్జున్ ఫిదా కావడంతో వెంటనే ఈ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. నిజంగానే ఇది జగన్ బయోపిక్‌గా వస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Published by:
Praveen Kumar Vadla
First published:
July 18, 2020, 10:03 PM IST