ప్రియా ప్రకాష్ కోసం ఈగోను పక్కనపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించిన ఒరు ఆధార్ లవ్ తెలుగు వెర్షన్ ‘లవర్స్ డే’ సినిమా ఆడియో రిలీజ్ వేడుక 23న జరగనుంది. ఆ కార్యక్రమానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నాడు.

news18-telugu
Updated: January 23, 2019, 5:00 AM IST
ప్రియా ప్రకాష్ కోసం ఈగోను పక్కనపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
ప్రియా ప్రకాష్ వారియర్, అల్లు అర్జున్
  • Share this:
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ఇప్పుడు తెలియని వారు ఉండరేమో. కేవలం రెండే రెండు నిమిషాల వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఆమె కన్నుగీటితే కుర్ర హృదయాలు కలవరం చెందాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రియా ప్రకాష్ వారియర్‌తో కలసి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేదికను పంచుకోబోతున్నారు.

Sridevi Bungalow: Boney Kapoor Slaps Legal Notice on Priya Prakash Varrier Latest Movie అనుమతి లేకుండా తీసేస్తారా..ప్రియా ప్రకాష్ ‘శ్రీదేవి బంగ్లా’పై బోనీ కపూర్ ఫైర్
ప్రియా ప్రకాష్ వారియర్


ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మళయాళ సినిమా ‘ఒరు ఆధార్ లవ్’ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో వస్తోంది. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈ ‘లవర్స్ డే’ సినిమా తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 23న జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు.

అల్లు అర్జున్‌కి తెలుగుతోపాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ యాక్ట్ చేసిన సినిమాలు అక్కడ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా సాధించాయి.

ఇవి కూడా చదవండి

 

First published: January 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు