Home /News /movies /

ALLU ARJUN INVITED AS CHEIF GUEST FOR INDIA DAY PARADE SLB

Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. బన్నీ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ

అల్లు అర్జున్ (Photo Twitter)

అల్లు అర్జున్ (Photo Twitter)

Allu Arjun: అల్లు వారింటి నట వారసుడిగా సినీ గడపతొక్కిన అల్లు అర్జున్.. తనదైన టాలెంట్‌తో అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు (Allu Arjun ) అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 21వ తేదీన న్యూయార్క్‌లో జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్‌కి (India day Parade) ఆహ్వానిస్తూ ఆయనకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చారు. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రాబోతున్నారనే విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 21వ తేదీన జరిగే 40వ భారత దినోత్సవ పరేడ్‌కి అల్లు అర్జున్ నాయకత్వం వహిస్తారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షులు కెన్నీ దేశాయ్ చెప్పారు. అల్లు అర్జున్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అల్లు వారింటి నట వారసుడిగా సినీ గడపతొక్కిన అల్లు అర్జున్.. తనదైన టాలెంట్‌తో అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. టాలీవుడ్ కి పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించి ప్రస్తుతం అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్ క్రేజ్ ఎల్లలు దాటింది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి నెలకొంటూ ఉంటుంది.

ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసి సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు అదే సినిమా సీక్వల్ కోసం రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. సుకుమార్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తన లుక్‌ను మరింతగా మార్చుకున్నారు అల్లు అర్జున్. పుష్పలో కనిపించిన మాస్ అవతారానికి రెట్టింపుగా ఈ సినిమాలో బన్నీ కనిపించనున్నారట. అతి త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ప్రస్తుతం షూటింగ్స్ పరంగా కాస్త గ్యాప్ దొరకడంతో తన భార్యాపిల్లలతో కలిసి విదేశాలు చుట్టేస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీ ఆఫ్రికాలో టాంజానియా (Tanzania)లో షికారు చేస్తోంది. భార్యాబిడ్డలతో కలిసి అక్కడి అందమైన లొకేషన్స్ తిరుగుతున్నారు బన్నీ.
Published by:Sunil Boddula
First published:

Tags: Allu Arjun, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు