ALLU ARJUN INTERESTING COMMENTS ON VIZAG FANS AT GHANI PRE RELEASE EVENT SB
Allu Arjun: ఎంతసేపు ఆ డైలాగ్సేనా.. వైజాగ్ వాసులపై బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్
తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్‌తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మన సినిమాలే బాలీవుడ్లో కుమ్మేస్తున్నాయి. మన సినిమాలు అక్కడ రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పుడు తమ సినిమాలతో హిందీలో కూడా చర్చనీయాంశంగా మారారు.
బన్నీ తన స్పీచ్‌ను ప్రారంభించగానే.. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా గోల చేశారు. పుష్ప సినిమా డైలాగ్స్‌తో బన్నీని నవ్వించారు. బన్నీ నవ్వుతూ...అరే అల్లరి విషయంలో వైజాగ్ వాళ్లు తగ్గేదేలే అంటూ... డైలాగ్ వేశాడు.
వైజాగ్ అంటే బన్నీకి ఎంతో ఇష్టం ఇది అందరికీ విషయం తెలిసిందే. బన్నీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు చేసిన దాదాపు అన్ని సినిమాలన్నీ ఇక్కడ షూటింగ్ చేశాడు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బన్నీ మరోసారి వైజాగ్ వచ్చాడు. ఈ సందర్బంగా విశాఖ నగరంపై తనకున్న ప్రేమను మరోసారి తెలిపారు. తనకు పర్సనల్‌గా వైజాగ్ అంటే చాలా ఇష్టమన్నాడు బన్నీ.
హాయ్ వైజాగ్ అంటూ.. బన్నీ తన స్పీచ్‌ను ప్రారంభించగానే.. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా గోల చేశారు. పుష్ప సినిమా డైలాగ్స్‌తో బన్నీని నవ్వించారు. బన్నీ నవ్వుతూ...అరే అల్లరి విషయంలో వైజాగ్ వాళ్లు తగ్గేదేలే అంటూ... డైలాగ్ వేశాడు.దీంతో మరోసారి అక్కడున్న అభిమానులతో ఈలలు గోలలు వేస్తూ... సందడి చేశారు.
అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ.. నాకు మాత్రం ఆర్మీ ఉంటుందన్నాడు బన్నీ. తన ప్రాణానికి ప్రాణం అయిన ఆర్మీకి ఐ లవ్ యూ చెప్పాడు. తన ఫ్యాన్సే తనకు బలం అన్నాడు. ఫ్యాన్స్ చేస్తున్న మంచి పనులపై ప్రశంసలు కురిపించాడు బన్నీ. తన ఫ్యాన్స్‌ను చూసి తనకు కూడా ఏమైనా మంచి పనులు చేయాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. నా ఫ్యాన్సే నా ఇన్స్పిరేషన్ అన్నాడు అల్లు అర్జున్. బన్నీ మాట్లాడుతుంటే మళ్లీ గోల చేశారు అభిమానులు. దీంతో ‘మీకు ఎంత సేపు పంచ్ లు పంచ్ డైలాగులు కావాలి’ అంటూ వారిపై సెటైర్లు వేశారు బన్నీరు. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ... కామెంట్లు చేశాడు.
ఇక గని సినిమాతో వస్తున్న వరుణ్ తేజ్‌ను ప్రేక్షకులంతా ఆదరించాలని కోరాడు. గని సినిమాను తాను చూశానని చాలా బాగుందని చెప్పుకొచ్చాడు. తనకు చిన్నప్పటి నుంచే వరుణ్ అంటే చాలా ఇష్టమన్నాడు. పుట్టినప్పటి నుంచే వరుణ్ అందగాడన్నాడు బన్నీ. చాలా క్యూట్‌గా ఉండేవాడన్నాడు. వరుణ్ సినిమాల్లోకి వచ్చాక అతనిపై ఇష్టం ప్రేమతో పాటు.. గౌరవం కూడా పెరిగిందన్నారు. వరుణ్ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రతీ సినిమా కోసం చాలా కష్టపడతాడన్నారు. గని సినిమా కోసం కూడా వరుణ్ చాలా కష్టపడ్డాడన్నాడు బన్నీ. గని సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.