• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • ALLU ARJUN ICON DIL RAJU CLARIFIES ABOUT SRIRAM VENU ICON MOVIE HERE ARE THE DETAILS TA

Allu Arjun - Dil Raju: అల్లు అర్జున్ ‘ఐకాన్’ మూవీపై కుండ బద్దలు కొట్టిన దిల్ రాజు..

అల్లు అర్జున్ ‘ఐకాన్’ మూవీపై దిల్ రాజు క్లారిటీ (Twitter/Photo)

Allu Arjun - Dil Raju: నిర్మాత దిల్ రాజు.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఈయన అల్లు అర్జున్‌తో ‘ఐకాన్’ మూవీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    Allu Arjun - Dil Raju: నిర్మాత దిల్ రాజు.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఈయన తొలిసారి పవన్ కళ్యాణ్‌తో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాను తెరకెక్కించారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఈ సమయంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా భారీ సక్సెస్ సాధించినందుకు దిల్ రాజు.. ఈ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణుతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ సినిమా మేమనుకున్నట్టుగా చాలా మంది ప్రేక్షకులకు చేరువైంది. ఈ తర్వాత శాటిలైట్, డిజిటల్ వంటి మీడియా వేదికలుగా మరింత మంది ఆడియన్స్‌కు ఈ సినిమా చేరువ చేయడమే మా లక్ష్యమన్నారు.

    ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో గతంలో ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని త్వరలో తెరకెక్కించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఈ లోపు పవన్ కళ్యాణ్‌తో శ్రీరామ్ వేణు ‘వకీల్ సాబ్’ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. మా బ్యానర్‌లో నెక్ట్స్ మూవీ ‘ఐకాన్’. ఆ స్టోరీ నా మనసుకు బాగా నచ్చింది. వేణు ఈ కథ చెప్పిన దగ్గర నుంచి ఈ స్టోరీతో ప్రయాణం  చేశాం. త్వరలో ఈ  సినిమా పట్టాలెక్కనుంది.

    Dil Raju Sriram Venu News18
    ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణుతో నిర్మాత దిల్ రాజు (Twitter/Photo)


    ఈ సందర్భంగా విలేఖరులు...పుష్ప టీజర్‌లో అల్లు అర్జున్ పేరు ముందు స్టైలిష్ స్టార్‌కు బదులుగా ‘ఐకాన్ స్టార్’ గా ఎందుకు వేశారని దిల్ రాజు ప్రశ్నించగా.. దానికి సమాధానమిస్తూ ఆ బిరుదును అల్లు అర్జున్ స్వయంగా పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తన ప్రమేయం ఏమి లేదన్నారు. మొత్తంగా అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘ఐకాన్’ మూవీని స్టార్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

    allu arjun accepted koratala siva movie after sukumar pushpa movie what about dil raju sriram venu icon movie,allu arjun koratala siva,allu arjun,koratala siva,allu arjun,allu arjun twitter,allu arjun venu sriram icon movie,allu arjun pushpa movie,allu arjun icon venu sriram dil raju,allu arjun pushpa sukumar movie,allu arjun icon movie,allu arjun new movie,allu arjun,allu arjun movies,allu arjun new movie icon,allu arjun icon movie teaser,allu arjun upcoming movie,allu arjun icon,allu arjun latest movie,allu arjun icon movie trailer,allu arjun icon movie first look,allu arjun trivikram movie,allu arjun movie first look,allu arjun upcoming movies,icon movie,allu arjun new movie 2019,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప,అల్లు అర్జున్ ఐకాన్ సినిమా,అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా,కొరటాల శివ,అల్లు అర్జున్ 21
    అల్లు అర్జున్ ‘ఐకాన్’ మూవీ పోస్టర్ (Twitter/Photo)


    ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో చేద్దామనుకున్నారు. కానీ కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. మరోవైపు త్రివిక్రమ్.. తన నెక్ట్స్ మూవీని మహేష్ బాబు, పూజా హెగ్డే‌లతో తెరకెక్కించనున్నాడు. మొత్తంగా మన హీరోలు ఒకసారి సెట్ అయిన ప్రాజెక్ట్‌లను రద్దు చేసుకొని వేరే ప్రాజెక్ట్‌లను ముందుగా ప్రారంభించేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: