ALLU ARJUN HUGE SHOCK TO MAHESH BABU HERE ARE THE DETAILS TA
మహేష్ బాబుకు మరోసారి షాక్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్, మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబుకు అల్లు అర్జున్ మరోసారి బిగ్‌షాక్ ఇవ్వనున్నాడు. నిను వీడని నీడను నేనే అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబును అల్లు అర్జున్ అస్సలు విడిచిపెట్టడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు అల్లు అర్జున్ మరోసారి బిగ్‌షాక్ ఇవ్వనున్నాడు. నిను వీడని నీడను నేనే అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబును అల్లు అర్జున్ అస్సలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్ బాబు..‘సరిలేరే నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ముందుగా జనవరి 12న పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక అదే సమయంలో మహేష్ బాబు కూడా తాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను అదే డేట్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఇలా ఇద్దరు బడా హీరోలు ఒకే రోజున తన సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూసి ఫిల్మ్ నగర్ వర్గాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసాయి కూడా. ఆ తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 11న ప్రీ పోన్ చేసారు.
అల్లు అర్జున్ మహేష్ బాబు Instagram
ఒకరోజు ముందుగా రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కావడం అడ్వాంటేజ్. తాజాగా అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఇపుడు జనవరి 10న రిలీజ్ చేయాలనే ఆలోచిస్తున్నారు. ఈ రకంగా ఫస్ట్ డే కలెక్షన్స్ రూపంలో ఎక్కువ కొల్లగొట్టాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మరి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.