హోమ్ /వార్తలు /సినిమా /

అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. తెలుగులో ఈ ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదు..

అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. తెలుగులో ఈ ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదు..

అల్లు అర్జున్ (Allu Arjun OTT)

అల్లు అర్జున్ (Allu Arjun OTT)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు.  ఈ యేడాది అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటంచిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పట్లో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కావకపోవచ్చు. ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 263 మిలియన్ వ్యూస్ రాబట్టి.. తెలుగులో అత్యధిక మంది చూసిన సాంగ్‌‌గా రికార్డులకు ఎక్కింది. అంతకు ముందు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, వరుణ్ తేజ్‌ల ‘ఫిదా’ మూవీలో వచ్చిండే సాంగ్ 260 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉండే. అపుడు ఆ సాంగ్‌ను క్రాస్ చేస్తూ 265 మిలియన్ వ్యూస్ రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు బుట్ట బొమ్మ లిరికల్ సాంగ్ 49 మిలియన్ వ్యూస్ కలుపుకుంటే.. మొత్తంగా బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో 314 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ 1 బిలియన్ వ్యూస్ రాబట్టింది. తెలుగులో వన్ బిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది.

' isDesktop="true" id="553712" youtubeid="2mDCVzruYzQ" category="movies">

బుట్ట బొమ్మ సాంగ్ విషయానికొస్తే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఆర్మన్ మాలిక్ గొంతు కలిపారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ఈ  పాట సక్సెస్‌లో కీ రోల్ పోషించింది.  తమన్ ఈ సినిమాకు అందించిన బాణీలు గురించి ఎంత చెప్పినా తక్కువ.  అల వైకుంఠపురములో సినిమా తమన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్. సినిమా పరంగా దుమ్ము దులిపేసిన అల వైకుంఠపురములో పాటల విషయంలో కూడా సంచలనం సృష్టిస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలోని  బుట్టబొమ్మ సాంగ్‌తో పాటు  సామజవరగమన, రాములో రాములా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరోవైపు ‘అల వైకుంఠపురములో’  సినిమాను హిందీలో త్వరలో రీమేక్ కానుంది. అటు తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్‌కు సన్నాహాలు మొదలైయ్యాయి.

First published:

Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pooja Hegde, Thaman, Tollywood, Trivikram Srinivas

ఉత్తమ కథలు