news18-telugu
Updated: November 21, 2020, 9:46 AM IST
అల్లు అర్హకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ (Twitter/Photo)
Allu Arjun Daughter Allu Arha Happy Birthday | అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కూతురు పుట్టినరోజు సందర్బంగా అల్లు అర్జున్ అపురూపమైన కానుకగా అందించాడు అల్లు అర్జున్. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు అల్లు అర్జున్. ఈ రోజుతో అల్లు అర్హ.. నాలుగేళ్లు కంప్లీట్ చేసుకొని ఐదో యేట అడుగుపెట్టబోతుంది. ఈమె 2016 నవంబర్ 21న జన్మించింది. ఇక అల్లు అర్జున్ పిల్లల విషయానికొస్తే.. ఇప్పటికే వీళ్లు ప్రేక్షకులతో, అభిమానులతో యాక్టివ్గా ఉన్నారు. వీరి వీడియోస్కు లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వస్తుంటాయి. ఇక బన్ని కూడా తన ఇద్దరు పిల్లలను అభిమానులకు తెలిసేలా పెంచుతున్నాడు. వాళ్లకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. ఇప్పుడు కూడా అల్లు అర్హ, అయాన్ చేసిన డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ పిల్లలు చేసే విన్యాసాలకు అల్లు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ తనయ.. అర్హకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
అల్లు అర్జున్ విషయానికొస్తే.. ఈ యేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. మరోవైపు అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్లో రీసెంట్గా జాయిన్ అయ్యాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 21, 2020, 9:44 AM IST