తెలుగు దర్శకులతో అల్లు అర్జున్ సక్సెస్ పార్టీ..

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ ఇండస్ట్రీలో  రాజమౌళి తప్పించి మిగిలిన దర్శకులందరినీ పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు.

news18-telugu
Updated: February 3, 2020, 8:16 PM IST
తెలుగు దర్శకులతో అల్లు అర్జున్ సక్సెస్ పార్టీ..
తెలుగు దర్శకులకు అల్లు అర్జున్ సక్సెస్ పార్టీ (Twitter/Photo)
  • Share this:
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైయిన సంగతి తెలిసిందే కదా. ఈ  సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రేసుగుర్రంల బాక్సాఫీస్ దగ్గర ఇంకా దౌడు తీస్తునే ఉంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్ల షేర్.. రూ.215 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా బాహుబలి సిరీస్‌ తర్వాత తెలుగులో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘అల వైకుంఠపురములో’ నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ ఇండస్ట్రీలో  రాజమౌళి తప్పించి మిగిలిన దర్శకులందరినీ పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో ‘అల వైకుంఠపురములో’ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు అల్లు అర్జున్‌తో పనిచేసిన దర్శకులు సుకుమార్,సురేందర్ రెడ్డి, కరణాకరణ్, వంశీ పైడిపల్లితో పాటు మారుతి, కొరటాల శివ సహా దాదాపు అందరు హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హాజరయ్యాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 3, 2020, 8:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading