సిత్తరాల సిరపడు పాట పాడిన సూరన్నకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్...

అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్. అలాంటి స్టైలిస్ స్టార్ ఇచ్చిన జాకెట్‌ను స్టేజ్ మీద అందరి ముందే వేసుకున్నాడు సింగర్ సూరన్న.

news18-telugu
Updated: January 19, 2020, 10:58 PM IST
సిత్తరాల సిరపడు పాట పాడిన సూరన్నకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్...
అల్లు అర్జున్, సూరన్న
  • Share this:
అల వైకుంఠపురములో సినిమాలో అన్ని పాటలు ఎలా ఉన్నా... క్లైమాక్స్ ఫైట్‌లో వచ్చే సిత్తరాల సిరపడు అనే జానపదం మాత్రం ప్రత్యేకం. మిగిలిన పాటలు మంచి ఊపు, బీట్‌తో దుమ్మురేపినా.. ఈ పాట మాత్రం ప్రజల గుండెల్ని తడిమింది. ఉత్తరాంధ్ర యాసతో సాగిన ఈ పాటను బల్లా విజయ్ కుమార్ రాశారు. ఆయన మచిలీపట్నంలో ఎల్ఐసీ మేనేజర్. అయితే, ఆ పాటకు తన గొంతుతో జీవం పోసింది మాత్రం సూరన్న. ఉత్తరాంధ్ర వాసి అయిన సూరన్న గొంతులో నుంచి వచ్చిన ఆ పాట ధియేటర్లో, ధియేటర్ బయట ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదిగా అల వైకుంఠపురములో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ వేదిక మీద సింగర్ సూరన్నకు ఓ జాకెట్‌ను అల్లు అర్జున్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అల్లు అర్జున్ అంటే స్టైలిష్ స్టార్. అలాంటి స్టైలిస్ స్టార్ ఇచ్చిన జాకెట్‌ను స్టేజ్ మీద అందరి ముందే వేసుకున్నాడు సింగర్ సూరన్న. అంతకు ముందు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అల్లు అర్జున్ వేదిక మీదకు వెళ్లి జానపద గాయకుడు సూరన్నను ఆలింగనం చేసుకున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 19, 2020, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading