Allu Arjun: తాత నువ్విచ్చిందే ఇదంతా.. అల్లు అర్జున్ ఎమోషనల్..

Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో అల్లు వారి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిన అవసరం లేదు. దాదాపు 60 ఏళ్లుగా ఈ కుటుంబం సినిమాల్లోనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2020, 8:40 PM IST
Allu Arjun: తాత నువ్విచ్చిందే ఇదంతా.. అల్లు అర్జున్ ఎమోషనల్..
తాత అల్లు రామలింగయ్యతో బన్నీ (allu arjun allu ramalingaih)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో అల్లు వారి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిన అవసరం లేదు. దాదాపు 60 ఏళ్లుగా ఈ కుటుంబం సినిమాల్లోనే ఉంది. అల్లు రామలింగయ్య ఈ కుటుంబానికి ఆద్యుడు. ఆయన తర్వాత అల్లు అరవింద్ వచ్చాడు.. ఇప్పుడు ఆయన మనవడు అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్నాడు. తాజాగా తన తాతయ్యను మరోసారి గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నాడు బన్నీ.
తాత అల్లు రామలింగయ్యతో బన్నీ (allu arjun allu ramalingaih)
తాత అల్లు రామలింగయ్యతో బన్నీ (allu arjun allu ramalingaih)


తమ ఇంటి పెద్ద చనిపోయిన రోజును మరోసారి గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. తాత గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ఈ హీరో. తాత మమ్మల్ని మీరు వదిలివెళ్లిన ఈ రోజు నాకు గుర్తుంది.. మీ గురించి అప్పటి కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను.. నాకు అనుభవం వస్తున్న కొద్దీ మీరు పడిన కష్టాలు, కృషి, పట్టుదల ప్రయాణం ఏంటనే విషయం అర్థమైంది.. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామంటూ రాసుకొచ్చాడు బన్నీ.

ఆ రోజు మీరు చేసిన కృషి కారణంగానే ఈ రోజు మేం ఇంత హాయిగా ఉన్నామంటూ తాత చేసిన సేవలను గుర్తు చేసుకున్నాడు ఈయన. 1922లో జన్మించిన అల్లు రామలింగయ్య 2004 జులై 31న మరణించాడు. కాగా 2022 శతజయంతి సంవత్సరంగా అల్లు కుటుంబం ఘనమైన వేడుకలు ప్లాన్ చేస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 31, 2020, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading