హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun: అల్లు అర్జున్‌కు ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా? బన్నీ మామ షాకింగ్ కామెంట్స్!

Allu Arjun: అల్లు అర్జున్‌కు ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా? బన్నీ మామ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్

అల్లు అర్జున్

బన్నీకి కట్నం ఎంత ఇచ్చారన్న విషయంపై ఆయన మామ, అల్లు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  అల్లు అర్జున్  స్నేహ రెడ్డిల(Allu Sneha Reddy) పెళ్లి మార్చి 6, 2011 న జరిగింది. వీరి వివాహం జరిగి 11 ఏళ్లు పూర్తయ్యింది. అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. ముఖ్యంగా తన భార్య స్నేహ రెడ్డి పట్ల తన ప్రేమను వ్యక్తపరచటానికి ఎప్పుడూ వెనక్కి తగ్గడు. ఈ అందమైన జంటకు అల్లు అయాన్ అల్లు అర్హా అనే ఇద్దరు పిల్లలు. స్నేహా రెడ్డిని అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అల్లు అర్జున్ మామ బన్నీ(Bunny)పై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ మామ పేరు చంద్రశేఖర్ ఆయన ఓ రాజకీయ నేత. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీపై ఆసక్తికవర వ్యాఖ్యలు చేశారు. బన్నీ అల్లుడుగా వందకు వంద మార్కులు వేశాడు. బన్నీపై ప్రశంసలు వర్షం కురపించాడు.  ఇంట్లో ఉన్నప్పుడు బన్నీ అనే పిలుస్తామని.. బయటకు వెళ్తే మాత్రం అర్జున్ అనే అంటానన్నాడు. అయితే.. ఓ పాన్ ఇండియా స్టార్‌గా బన్నీ ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారన్నారు ఆయన మామ. ఈ మధ్యనే.. అల్లు అర్జున్ అత్తగారు జమ్ముకాశ్మీర్ వెళ్లారని.. అక్కడ ఎవరో బన్నీ పాట వింటున్నారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఆమె బన్నీ అత్తగారు అని తెలియడంతో వెంటనే సెల్ఫీలు దిగారని చెప్పుకొచ్చారు.

అయితే బన్నీకు ఎంత కట్నం ఇచ్చారో చెప్పాలంటూ..  యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. బన్నీ కట్నమే తీసుకోలేదన్నారు. బన్నీకి కట్నం ఇచ్చేంత స్థాయి లేదన్నారు.వాళ్లకే ఎక్కువ ఉందంటూ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. మనం  ఇచ్చేది వారికి లెక్క కూడా కాదన్నారు. రీసెంట్‌గా పుష్ప సక్సెస్ సందర్భంగా డైరక్టర్లకు హోటల్‌లో చిన్న ట్రీట్ ఇచ్చారన్నారు. అక్కడ అర్జున్‌ను కలిశామన్నారు. అల్లు  అర్జున్ ఎప్పుడు అంటే అప్పుడు కలుస్తామన్నారు. దీంతో ఇప్పుడు .. ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. బన్నీ కట్నం తీసుకోలేదా అంటూ అతని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

First published:

Tags: Allu Arjun, Allu sneha reddy

ఉత్తమ కథలు